ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల : నంద్యాలలో, జిల్లా కలెక్టర్- జి.రాజకుమారి గణియా అధ్యక్షతన ఏర్పాటుచేసిన ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో డివిఎంసి కమిటీ మెంబర్ లింగాల.నాగరాజు నందికొట్కూరు నియోజకవర్గం లోని, మండలాలలో ఉన్న సమస్యల గురించి ప్రస్తావించడం జరిగింది. ఈ సందర్భంగా డీవీఎంసీ మెంబర్ లింగాల.నాగరాజు మాట్లాడుతూ జూపాడు బంగ్లా మండల కేంద్రంలో నున్న గురుకుల పాఠశాలకు చుట్టు ప్రహరీ గోడ నిర్మించాలని, అలాగే జూపాడుబంగ్లా మండలం, గ్రామ సమీపంలో నున్న సుగాలితాండకు రోడ్డు సౌకర్యం కల్పించాలని, జూపాడుబంగ్లా మండల కేంద్రంలో నున్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ భవన్ నిర్మించాలని, అలాగే పాములపాడు మండలంలోని, మిట్టకందాల గ్రామంలో నిర్మాణంలో ఉన్న అంగన్వాడి సెంటర్ ను త్వరగా పూర్తి చేసి ప్రారంభించాలని అన్నారు. అదేవిధంగా గత ఐదు సంవత్సరాల నుంచి నంద్యాల జిల్లాలో పెండింగ్లో ఉన్న ఎస్సీ ఎస్టీ పారిశ్రామిక ప్రోత్సాహకాలను, పెండింగ్లో ఉన్న రాయితీలను, త్వరగా విడుదల చేసి ఎస్సీ ఎస్టీ పారిశ్రామిక ప్రోత్సాహక లబ్ధిదారులకు న్యాయం చేకూర్చాలని కోరడమైనది. జిల్లా కలెక్టర్- జి.రాజకుమారి గణియా ఈ విషయాలపై సానుకూలంగా స్పందించి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకొని వెళ్లి, న్యాయం చేయిస్తామని న్యాయం చేయిస్తామని హామీ ఇవ్వడం జరిగింది.
Admin
E Nivas News