ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / ఆత్మకూరు : ఆత్మకూరు పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికొన్నత పాఠశాలలో స్వచ్ఛ్ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో మరియు పల్స్ పోలియో ర్యాలీలో శ్రీశైలం నియోజకవర్గం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ మన చుట్టుపక్కల ఉండే పరిసరాలు అన్నీటిని మనమే ప్రతిరోజు శుభ్రంగా ఉంచుకోవాలని ఇల్లు బాగుంటే వాడా బాగుంటుందన్నారు. వాడ బాగుంటే గ్రామం బాగుంటుంది అలానే గ్రామం బాగుంటే దేశం కూడా అభివృద్ధిలోకి నడుస్తుందని కేంద్ర ప్రభుత్వం, మరియు రాష్ట్ర ప్రభుత్వం ప్రతినెల మూడో శనివారం రోజు ఈ స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ దివస్ కార్యక్రమాన్ని అమలులోకి తీసుకురావడం జరిగింది అన్నారు. అదేవిధంగా పల్స్ పోలియోపై అవగాహన కల్పిస్తూ పోస్టర్లను విడుదల చేయడం జరిగింది. అనంతరం పాఠశాల విద్యార్థినీలు కలిసి పాట రూపంలో చేతులు ఎలా శుభ్రం చేసుకోవాలని విద్యార్థినులందరికీ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు, మున్సిపల్ చైర్ పర్సన్ మారుఫ్ ఆసియా, ఎంపీడీవో నాగేంద్ర, అర్బన్ హెల్త్ సెంటర్ డాక్టర్ సాజిత, జుబేర్, డిప్యూటీ తహసిల్దార్ ఆంజనేయ, పిఆర్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి సయ్యద్.చాంద్ భాష, హౌసింగ్ ఏఈ- ఉమామహేశ్వర్ రెడ్డి, టిడిపి కే.సి.కెనాల్ చైర్మన్ బన్నూరు రామలింగారెడ్డి, టిడిపి మండల అధ్యక్షుడు రవీంద్రబాబు, అబ్దుల్లాపురం భాష, శివ ప్రసాద్ రెడ్డి, నాగూర్ ఖాన్, నబీ, షాపుద్దీన్, విద్యా కమిటీ చైర్మన్ ఖాజా, ఎంఈఓ లు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉమారాణి, పాఠశాల అధ్యాపక బృందం, ఆత్మకూరు పట్టణ ఆశా వర్కర్ల బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.
Admin
E Nivas News