ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / కర్నూల్ : కర్నూలు పట్టణంలోని, బి.క్యాంపు ప్రభుత్వ జూనియర్ ఒకేషనల్ కళాశాల ఆధ్వర్యంలో నిర్వహించిన హర్ ఘర్ తిరంగా ర్యాలీలో పాణ్యo నియోజకవర్గం ఎమ్మెల్యే & టీడీపీ నంద్యాల జిల్లా అధ్యక్షురాలు గౌరు చరిత రెడ్డి, ఏపీ ఈడబ్ల్యూఐడీసీ రాష్ట్ర డైరెక్టర్ జి.నాగముని లు పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి, ఏపీ ఈడబ్ల్యూఐడిసి రాష్ట్ర డైరెక్టర్ జీ.నాగముని జాతీయ జెండాను చేతబూని హర్ ఘర్ తిరంగా ర్యాలీలో పాల్గొనడం జరిగింది. విద్యార్థుల్లో దేశభక్తి, జాతీయ సమైక్యత భావాన్ని పెంపొందించే కార్యక్రమాలకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి, ఏపీ ఈడబ్ల్యూఐడిసి రాష్ట్ర డైరెక్టర్ జి.నాగముని లు పిలుపు నిచ్చారు. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ఈ ర్యాలీ ఉత్సాహభరిత వాతావరణంలో సాగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు, ప్రభుత్వ జూనియర్ ఒకేషనల్ కళాశాల ప్రిన్సిపాల్ ఏ.స్వామి నాయక్, సెట్కూరు సీఈవో వేణుగోపాల్, అధ్యాపకులు, స్టూడెంట్స్, కూటమి నాయకులు, కార్యకర్తలు పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొనడం జరిగింది.
Admin
E Nivas News