Tuesday, 15 September 2026 06:22:49 AM
# మహిళల నాయకత్వాన్ని బలపరచండి... మాదిగ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు నందిని # నీటి సంఘం అధ్యక్షులు తిమ్మారెడ్డి కృషితో మద్దూరు కుంటకు కేసీ.కెనాల్ జలాలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఆశీర్వదించండి...! ఆత్మకూరు సింగల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దిన్ # పాములపాడులో ఘనంగా కామ్రేడ్ సీతారాం ఏచూరి రెండవ వర్ధంతి # ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పి ఆర్ టి యు నంద్యాల జిల్లా శాఖ ప్రాతినిధ్యం # కార్మికుడి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు... సింగరేణి భద్రతా ప్రమాణాలపై ఎంపీ హెచ్చరిక... # ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజకు ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారానికి ఎంపిక.. # ఫ్రీ బస్సు వద్దని మహిళల రాస్తారోకో.. # ఆర్థిక ఇబ్బందులతో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు జగన్ ఆత్మహత్య... # దసరా నుంచి లబ్ధిదారులకుకొత్త పింఛన్లు పంపిణీ... # శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్..

వేంపెంట గ్రామంలో ఘనంగా కామ్రేడ్ చండ్ర.పుల్లారెడ్డి 41వ వర్ధంతి కార్యక్రమం

ఆయన స్తుపం దగ్గర నివాళులర్పించి, సభలో కార్పొరేట్ శక్తులకు వ్యతిరేకంగా పోరాడుదాం అని పిలుపునిచ్చిన ప్రజా సంఘాల నాయకులు

Date : 10 November 2025 06:40 PM Views : 328

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : కామ్రేడ్ చండ్ర పుల్లారెడ్డి 41వ వర్ధంతి సభను పాములపాడు మండలంలోని, వేంపెంట గ్రామంలో నిర్వహించడం జరిగింది. ఈ సభకు సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీ నంద్యాల జిల్లా కార్యదర్శి వై.నరసింహులు అధ్యక్షత వహించారు. అనంతరం జరిగిన సభలో సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కామ్రేడ్ చిట్టిపాటి. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ వ్యవసాయాన్ని, కార్పొరేట్ కంపెనీలకు ఇస్తూ, దేశ సంపదను ఖనిజ వనరులను కార్పోరేట్ల చేతులలో పెడుతూ, రెండోవైపు కార్మికులకు పని గంటలు పెంచుతూ, పెట్టుబడిదారులకు కట్టు బానిసలను కావించే విధానాలకు వ్యతిరేకంగా పోరాడడమే మన ముందున కర్తవ్యమని ఆయన అన్నారు. ప్రతిఘటన పోరాట నిర్మాత, విప్లవోద్యమ అగ్ర నాయకులు కామ్రేడ్ చండ్ర పుల్లారెడ్డి 41వ వర్ధంతి సందర్భంగా వెంపెంటలో జరిగిన సభలో అయన ఉపన్యాసించారు. కామ్రేడ్ చండ్ర పుల్లారెడ్డి వెలుగోడులో జన్మించి, ఇంజనీరింగ్ విద్యను మధ్యలో వదిలేసి విప్లవొద్యమానికి అంకితం అయ్యారన్నారు.1952లో నందికొట్కూరు శాసనసభ్యులుగా రాయలసీమ కరువుకాటకాలపైన, నీటి సమస్యలపైన మద్రాస్ అసెంబ్లీలో ఏడు గంటలు సుదీర్ఘ ఉపన్యాసం చేశారన్నారు. పేద ప్రజల భూముల కోసం వారి హక్కుల కోసం పోరాడి తంగడంచ, రాపులచెరువు1000 ఎకరాలు పగిడ్యాల, లక్ష్మాపురం తదితర గ్రామాలకు పంపిణీ చేయడంలో ఆయన కీలకపాత్ర పోషించారు. భూమి భుక్తి -విముక్తి కోసం సాయుధ పోరాటమే మార్గమని భావించి 1969 నవంబర్-9 వ తేదీన గోదావరి లోయ పరివాహక ప్రాంతంలో సాయిద దళాలు నిర్మించారు. ఆ సిద్ధాంత వెలుగులో గోదావరి లోయ ఇరువైపులా ఐదు లక్షల ఎకరాలు అటవీ భూములను ఆదివాసులు పంపిణీ చేసుకోవడంలో ఆయన కీలక భూమిక వహించారు. కర్నూలు జిల్లా కార్యదర్శిగాను, రాష్ట్ర కమిటీ సభ్యుడిగాను, కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి గాను అంచలంచలుగా ఎదిగి విప్లవొద్యమానికి నాయకత్వం వహించారు. భారత దేశంలో చీలికలు గురైన విప్లవోద్యమాన్ని ఐక్యం చేయడంలో మహత్తరమైన కృషిని కొనసాగించారని అన్నారు. దానిలో భాగంగా చర్చలకు బెంగాల్ వెళ్లి గుండెపోటుతో నవంబర్-9వ తేదీన అమరులయ్యారు. భారతదేశంలో ప్రజలు ఎదుర్కొంటున్న తక్షణ సమస్యలను ప్రతిపాదికగా ప్రజా ఉద్యమం తీవ్రతరం చేయడమే కామ్రేడ్ చండ్ర పుల్లారెడ్డి కి మనం అర్పించే నిజమైన నివాళిని కామ్రేడ్ చిట్టిపాటీ వెంకటేశ్వర్లు విప్లవ జోహార్లు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఐ ఎఫ్ టి యు రాష్ట్ర సహాయ కార్యదర్శి కే.అరుణ్ కుమార్, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ కర్నూలు జిల్లా కార్యదర్శి మల్లికార్జున, ఐ ఎఫ్ టి యు నంద్యాల జిల్లా అధ్యక్షులు పి.మజీద్ మియా, ఏఐకేఎంఎస్ జిల్లా కార్యదర్శి ఎం.గోపాల్, పిడిఎస్ యు రాష్ట్ర అధ్యక్షులు భాస్కర్, పి డి ఎస్ యు నంద్యాల జిల్లా కార్యదర్శి రాంబాబు, జిల్లా నాయకులు ఆది, ఏఐకేఎంఎస్ జిల్లా నాయకులు ఆనంద్, పిడిఎస్యు నాయకులు మహేంద్ర, హమాలి వర్కర్స్ యూనియన్ నాయకులు స్వాములు, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు కే.గోవింద్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :