ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / ఆత్మకూరు : ఆత్మకూరు పట్టణానికి చెందిన ఆర్యవైశ్య ప్రముఖులు కీర్తి శేషులు పెసల హరిబాబు కుమార్తె ప్రియంవద ఇటీవల విడుదల అయిన గ్రూప్ -1 ఫలితాలలో సబ్ కలెక్టర్ గా ఎంపిక అయ్యి తన ప్రతిభని చాటారు. అతున్నత పదవికి ఎంపికైన తరవాత తన సొంత గడ్డ కి విచ్చేసిన సందర్బంగా ఆమెకు రాజా ట్రేడర్స్, శ్రీ లక్ష్మి వెంకటేశ్వర కిరాణం స్టోర్ అధినేత రాజా లక్ష్మినారాయణ, మరియు ఆర్యవైశ్య ముఖ్య నాయకులు అందరు కలిసి శాలువా కప్పి, పూలే బోకే ఇచ్చి, శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేసి, ఘనంగా సన్మానించారు.
Admin
E Nivas News