ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / ఆత్మకూరు : ఆత్మకూరు మండలంలోని, నల్లకాలువ గ్రామానికి చెందిన మాజీ సైనికుడు శంకరయ్య నిన్న అనారోగ్యముతో మృతి చెందారు. ఆయన అంత్యక్రియలు ఈరోజు స్వగ్రామం నల్లకాలువలో జరిగాయి. మాజీ సైనికుల సభ్యులు శంకరయ్య అంత్యక్రియలకు హాజరై, భౌతిక కాయానికి భారత త్రివర్ణ పథకాన్ని ఉంచి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు మాజీ సైనికుల సంఘం ప్రెసిడెంట్ ప్రభాకర్ శెట్టి, వైస్ ప్రెసిడెంట్ సుబయ్య, విజయకుమార్, పుల్లయ్య పాల్గొన్నారు.
Admin
E Nivas News