ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / ఆత్మకూరు : ఆత్మకూరు పట్టణంలోని, ఆసార్ మసీదులో శాంతి మూర్తి(మిలాద్ ఉన్ నబీ) మహమ్మద్ ప్రవక్త జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రతి సంవత్సరం నిర్వహించే ఈ వేడుకలను ముస్లిం సోదరులు భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆసార్ మసీదును ప్రత్యేకంగా అలంకరించారు. ముస్లిం సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. మహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకుని ఆయన బోధనలు, సందేశాలను స్మరించుకున్నారు. వేడుకల సందర్భంగా మత పెద్దలు శాంతి, సోదరభావం, ఐక్యత, మానవతా విలువల ప్రాధాన్యతను వివరించారు. ప్రతి ఒక్కరూ సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షిస్తూ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మిలాద్ ఉన్ నబీ వేడుకల కార్యక్రమంలో మౌలానా మహమ్మద్ గౌస్, ఆసార్ మాలిక్, బట్టల సుల్తాన్,ఫ్రూట్ కరీముల్లా, అమ్రుల్లా, లాలు, మాజీ కౌన్సిలర్ కలిముల్లా, హబీబ్, సయ్యద్ గౌస్, అశోక్, ఇర్ఫాన్, మహమ్మద్ రఫీ, పాల్గొన్నారు.
Admin
E Nivas News