ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల : నంద్యాల పట్టణంలోని, జిల్లా కలెక్టరేట్ లో జాయింట్ కలెక్టర్(జెసి)-కే.కార్తీక్, జిల్లా విద్యాశాఖ అధికారి-జనార్దన్ రెడ్డి, డిఆర్ఓ- రాము నాయక్ లను ఏపీ ఈడబ్ల్యుఐడీసీ రాష్ట్ర డైరెక్టర్- జి.నాగముని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాలు కప్పి, పూల బొకేలు చేతికి అందించి శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్- జి.నాగముని ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి అన్ని రకాలుగా కృషి చేయాలని, సంపూర్ణ అక్షరాస్యతకు పాటుపడాలని కోరారు. అదేవిధంగా చదువుకోవడానికి, క్రీడలలో రాణించడానికి ఆర్థిక స్థోమత లేని పేద విద్యా (విద్యార్థులకు) కుసుమాలకు, పేద క్రీడాకారులకు అన్ని విధాలుగా తమ సహాయ, సహకారాలు అందించి చేయూతనివాలన్నారు.
Admin
E Nivas News