ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / ఆత్మకూరు : సెమీ క్రిస్మస్ వేడుకలు అందరి జీవితాలలో పరిమళాలను వెదజల్లాలని ఆత్మకూరు సింగిల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దీన్ కోరారు. గురువారం ఆత్మకూరు మండల కాన్ఫరెన్స్ హాల్ నందు హెల్త్ డిపార్ట్మెంట్ (యు పి హెచ్ యు) నాయకురాలు శీలం శాంతి, మురహరి.శాంతమ్మ ల ఆధ్వర్యంలో సెమి క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సెమీ క్రిస్మస్ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆత్మకూర్ మండలం సింగిల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దీన్, డాక్టర్ ఎం.కె.రాజేశ్వరమ్మ, టీ.బి. యూనిట్ సీనియర్ ట్రీట్మెంట్ సూపర్వైజర్ కల్లూరి పెద్ద మస్తానయ్య మరియు డి.సుబ్బరాజు లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, హెల్త్ సూపర్వైజర్ కల్లూరి పెద్ద మస్తానయ్య లు మాట్లాడుతూ క్రైస్తవులందరూ ఏసుక్రీస్తు జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని, అందరూ సుఖసంతోషాలతో, ఆనందంగా ఉండాలని, క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుపుకోవాలన్నారు. అదేవిధంగా డాక్టర్ రాజేశ్వరమ్మ ప్రసంగిస్తూ కీర్తనలను ఆలాపించారు. ఈ కార్యక్రమంలో సుబ్బమ్మ, మల్లేశ్వరి, మండలంలోని ఆశా వర్కర్లు, ఆరోగ్య సిబ్బంది మరియు తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News