ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / నందికొట్కూరు : నందికొట్కూరు మండలంలోని, వడ్డమాను గ్రామంలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన స్వచ్ఛ్ ఆంధ్ర - స్వర్ణాంధ్ర' కార్యక్రమంలో పాల్గొని స్కూల్ ఆవరణలో చెట్లు నాటి, స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞ చేయించి, వడ్డమాన్ ప్రభుత్వ పాఠశాల ఆవరణలో ఎమ్మెల్యే గిత్త.జయసూర్య అధికారులు, నాయకులతో, వైద్య సిబ్బందితో కలిసి చెత్తను ఊర్చి శుభ్రం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గిత్త.జయసూర్య మాట్లాడుతూ ప్లాస్టిక్ వినియోగం వల్ల పర్యావరణానికి కలిగే నష్టాల గురించి ప్రజలలో అవగాహన కల్పించడం యొక్క ప్రాముఖ్యతను వివరించారు. "స్వచ్ఛ్ ఆంధ్ర - స్వర్ణాంధ్ర కార్యక్రమం ద్వారా రాష్ట్రాన్ని పరిశుభ్రంగా, పచ్చగా మరియు ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం కృషి చేస్తోంది. ప్లాస్టిక్ రహిత గ్రామాలలో ఏర్పాటు కోసం ప్రతి ఒక్కరూ సహకరించాలి," అని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం డిసెంబర్-21 న రాష్ట్ర వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా 0-5 ఏళ్లలోపు చిన్నారులందరికీ పోలియో చుక్కలు వేయించాలని ఉపాధ్యాయులు, విద్యార్థులు, ఏఎన్ఎంలు, ఆశావర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తలతో కలిసి ఎమ్మెల్యే గిత్త.జయసూర్య ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గిత్త.జయసూర్య మాట్లాడుతూ ఆదివారం నిర్వహించే శిబిరాలలో పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని, వైద్యసిబ్బంది గ్రామాలలో ఐదేళ్ల లోపు చిన్నారులను గుర్తించి పోలియో చుక్కలు వేయించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పోలియో చుక్కలు వేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కూడా తెలిపారు. పోలియో వ్యాధిని తరిమికొట్టి మన పిల్లలకు బంగారు భవిష్యత్తును అందిద్దాం అని ఎమ్మెల్యే గిత్త.జయసూర్య పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నందికొట్కూరు మార్కెట్ యార్డ్ డైరెక్టర్ & మండల కన్వీనర్ మాండ్ర.సురేంద్రనాథ్ రెడ్డి, ఈఓఆర్డి ఎస్.వెంకటరంగా నాయక్, నాయకులు సత్యం రెడ్డి, నాగేశ్వర్ రెడ్డి, గ్రామ సర్పంచ్ రామచంద్రుడు, తలారి వెంకటరాముడు, గజేంద్ర, దిలీప్ నాయుడు, ఎమ్మెల్యే గవర్నమెంట్ పిఏ-రవీంద్ర, మాండ్ర.శివానందరెడ్డి పిఎ-మద్దిలేటి, ప్రభుత్వ అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, ప్రభుత్వ అధికారులు, పోలీసు సిబ్బంది నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Admin
E Nivas News