Wednesday, 29 July 2026 12:07:59 AM
# కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి

ఈ నెల 17న జాతీయ నులి పురుగుల నిర్మూల‌న కార్య‌క్ర‌మం

Date : 13 February 2026 11:46 PM Views : 115

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / ఎన్టీఆర్ జిల్లా : జిల్లాలో ఈ నెల 17న చేపట్టే జాతీయ నులి పురుగుల నిర్మూలన కార్యక్రమాన్ని స‌మ‌న్వ‌య శాఖ‌ల అధికారులు స‌మ‌ష్టిగా కృషిచేసి విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.ల‌క్ష్మీశ ఆదేశించారు. శుక్ర‌వారం క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ జాతీయ నులి పురుగుల నిర్మూల‌న కార్య‌క్ర‌మం నిర్వ‌హ‌ణ‌పై క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ వైద్య ఆరోగ్యం, మ‌హిళా శిశు సంక్షేమం, పాఠ‌శాల‌, ఇంట‌ర్మీడియెట్ విద్య త‌దిత‌ర శాఖ‌ల అధికారుల‌తో వ‌ర్చువ‌ల్ స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ డాక్టర్ జి.ల‌క్ష్మీశ మాట్లాడుతూ 1-19 ఏళ్ల వారికి కార్య‌క్ర‌మాన్ని అమ‌లుచేయ‌డం జ‌రుగుతుంద‌ని, అంగ‌న్వాడీ కేంద్రాలు, ప్ర‌భుత్వ‌, ప్రైవేటు పాఠ‌శాల‌లు, జూనియ‌ర్ క‌ళాశాల‌లు, పాలిటెక్నిక‌ల్ త‌దిత‌ర విద్యాసంస్థ‌ల విద్యార్థుల‌కు అల్బెండ‌జోల్ ఇవ్వ‌డం జ‌రుగుతుంద‌న్నారు. దాదాపు అయిదు ల‌క్ష‌ల మంది చిన్నారుల‌కు ఈ మాత్ర‌లు ఇవ్వాలని ల‌క్ష్యంగా నిర్దేశించుకున్న‌ట్లు తెలిపారు. ఏడాది నుంచి రెండేళ్ల చిన్నారుల‌కు 200 ఎంజీ అల్బెండ‌జోల్ (చ‌ప్ప‌రించి మాత్ర‌మే) ఇవ్వాల‌ని.. అదేవిధంగా మిగిలిన వారికి 400 ఎంజీ సింగిల్ డోస్ ఇచ్చేందుకు చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు. ఈ అంశంపై స‌మ‌న్వ‌య శాఖ‌ల అధికారులు, సిబ్బంది అవ‌గాహ‌న పెంపొందించుకోవాల‌న్నారు. నులిపురుగులు వ‌ల్ల పిల్లలు నీరసంగా ఉంటారని, శారీరక మానసిక ఎదుగుదల లోపాలు త‌లెత్తుతాయ‌ని, ఇలాంటి ప‌రిస్థితి రాకుండా ఉండాలంటే త‌ప్ప‌నిస‌రిగా ఈ మాత్ర‌లు వేసేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు. ఆరోగ్య ఆంధ్ర‌, ఆరోగ్య భార‌త్ సాకారానికి ఇది చాలా ముఖ్య కార్య‌క్ర‌మ‌మ‌న్నారు. ఈ కార్యక్రమాన్ని జిల్లాలోని ప్రాథ‌మిక ఆరోగ్య కేంద్రంలోని వైద్య అధికారులు, మండల విద్యా శాఖాధికారులు, ఆశా, అంగన్వాడీ కార్యకర్తలు పర్యవేక్షించాలని, సంబంధిత శాఖల జిల్లా అధికారులు ఈ కార్యక్రమం పకడ్బందీగా జరిగేలా చూడాలని తెలిపారు. వివిధ కార‌ణాల వ‌ల్ల ఫిబ్ర‌వ‌రి-17న మాత్ర‌లు తీసుకోని చిన్నారుల‌కు మాప్ అప్ డే రోజున ఈ నెల 24వ తేదీన అల్బెండ‌జోల్ మాత్ర ఇచ్చేందుకు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ సూచించారు. ఈ సమావేశంలో డీఎంహెచ్‌వో డా. ఎం.సుహాసిని, ఆర్‌బీఎస్‌కే కార్య‌క్ర‌మం కోఆర్డినేట‌ర్ డా. జి.మాధ‌వి, డీఈవో ఎల్‌.చంద్ర‌క‌ళ‌, జిల్లా మ‌హిళా శిశు సంక్షేమ అధికారి రుక్సానా సుల్తానా బేగం, ప్రోగ్రామింగ్ అధికారులు, స‌మ‌న్వ‌య శాఖ‌ల అధికారులు త‌దిత‌రులు పాల్గొన్నారు. ఈ సమాచారం డీఐపీఆర్‌వో, ఐ అండ్ పీఆర్‌, ఎన్‌టీఆర్ జిల్లా వారి ద్వారా జారీ చేయడం జరిగింది.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :