Tuesday, 28 July 2026 04:37:57 PM
# చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి # టెలికామ్ వినియోగదారులకు మెరుగైన సేవలే ట్రాయ్ లక్ష్యం # భక్తిశ్రద్ధలతో బోనాల వేడుకలు.. # బెల్లంపల్లి ఎం.జె.పి. బాలికల పాఠశాల విద్యార్థినులు క్షేమం... # కేటీఆర్ అంకుల్‌కు 50వ జన్మదిన శుభాకాంక్షలు.. # విద్యా వ్యవస్థ పై విద్యార్థులకు నమ్మకం సన్నగిల్లింది... యు ఎస్ ఎఫ్ ఐ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ.. # ఘనంగా కేటీఆర్50వ జన్మదిన వేడుకలు.. # నల్లకాల్వ గ్రామంలో వర్షం కోసం గంగమ్మకు ప్రత్యేక పూజలు

ఘనంగా మెగా పిటిఎం 4.0 నిర్వహణ

మండల పరిషత్ మోడల్ ప్రాథమిక పాఠశాల, రహమత్ నగర్‌లో మెగా పేరెంట్–టీచర్ మీటింగ్ విజయవంతం

Date : 24 July 2026 10:41 PM Views : 41

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / ఆత్మకూరు : ఆత్మకూరు మండలం పరిధిలోని, మండల పరిషత్ మోడల్ ప్రాథమిక పాఠశాల, రహమత్ నగర్లో రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన మెగా పేరెంట్–టీచర్ మీటింగ్ (మెగా పిటిఎం 4.0) కార్యక్రమం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీమతి సయ్యదా పర్వీన్ బాను అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి అర్బన్ హెల్త్ సెంటర్ వైద్యాధికారి డాక్టర్ షాహినాజ్, ప్రత్యేక అధికారి ఏ.వి. రమణ, ఏవో, పాఠశాల నిర్వహణ కమిటీ సభ్యులు ఖాజా, రఫీక్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయుడు, పిఆర్టియు నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి సయ్యద్ చాంద్ బాష మాట్లాడుతూ మెగా పేరెంట్–టీచర్ మీటింగ్ నిర్వహణ ఉద్దేశాన్ని తల్లిదండ్రులకు వివరించారు. విద్యా రంగానికి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యత వల్ల ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల్లో విశ్వాసం పెరిగి, అడ్మిషన్లు కూడా అధికమవుతున్నాయని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందిస్తున్న ఉచిత పాఠ్యపుస్తకాలు, సర్వేపల్లి రాధాకృష్ణ విద్యా మిత్ర కానుకలు, తల్లికి వందనం, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం, జిఎఫ్ఎల్ఎల్ లీప్ యాప్ వంటి కార్యక్రమాలపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. అలాగే పాఠశాలలో ఉన్న మౌలిక సదుపాయాలు, ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలు, విద్యార్థుల అభ్యాస పురోగతికి తల్లిదండ్రులు ఇంటి వద్ద చేపట్టాల్సిన చర్యలను వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు ముబీన్ పర్వీన్, బషీర్ అహ్మద్, యస్మీన్, సచివాలయ సిబ్బంది, ఆరోగ్య కార్యకర్తలు, పాఠశాల సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :