Saturday, 12 September 2026 09:25:47 PM
# శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్.. # కోతులను పారద్రోలడానికి కొండెంగ అవతారం ఎత్తిన ఉపసర్పంచ్ # కొండగట్టు బస్ ప్రమాద విషాదానికి నేటికి ఎనిమిదేళ్ళు... # అడవుల సంరక్షణలో అటవీ అధికారుల పాత్ర కీలకమైనది.. కలెక్టర్ కుమార్ దీపక్ # ఓటర్ల ధ్రువపత్రాల పరిశీలన వేగవంతంగా చేయాలి.. కలెక్టర్ కుమార్ దీపక్ # ఘనంగా పోలాల అమావాస్య’ వేడుకలు.. ఎద్దులను అందంగా అలంకరించి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు.. # పాఠశాలల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలి.. కలెక్టర్ యువరాజ్ మర్మత్.. # ఆత్మహత్యల నివారణ దినం పోస్టర్ ఆవిష్కరణలో జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి.గితే.. # పోలీస్–అటవీ శాఖల మధ్య మరింత సమన్వయంతో అటవీ సంపద, వన్యప్రాణుల రక్షణకు చర్యలు తీసుకుంటాం... ఎస్పి అశోక్ కుమార్.. # హియరింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలి... కలెక్టర్ కుమార్ దీపక్ # చిట్యాల ఐలమ్మ పోరాట స్ఫూర్తిని నేటి యువతరం ఆదర్శంగా తీసుకొని సమాజంలో ఆర్థిక అసమానతల నిర్మూలనకై కృషి చేయాలి

పాములపాడు మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని డిటి, ఆర్ఐ లకు వినతి పత్రం సమర్పించిన సిపిఐఎంఎల్ జిల్లా కార్యదర్శి పిక్కిలి.వెంకటేశ్వర్లు

Date : 13 August 2026 05:53 PM Views : 76

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ ఆధ్వర్యంలో పాములపాడు మండల తహసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. ధర్నా అనంతరం డిప్యూటీ తహాసిల్దార్ షేక్. పఠాన్ బాబు, ఆర్ఐ- డి.ఖాజాబి లకు వినతిపత్రం అందజేశారు. ఈ ధర్నా కార్యక్రమానికి వడ్డే శ్రీరాములు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా లిబరేషన్ పార్టీ జిల్లా కార్యదర్శి పిక్కిలి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ పాములపాడు మండలంలో 2026 ఖరీఫ్ లో జూన్ మాసంలో 35%. వర్షం నమోదయిందని, వర్షాలు బాగా పడతాయని ఆశతో రైతులు మండలంలో, గ్రామీణ ప్రాంతాల్లో మొక్కజొన్న, పత్తి, మినుము, సోయాబీన్ తదితర పంటలు వేయడం జరిగిందని అన్నారు. అయితే జూన్, జూలై మాసం మొత్తం కలిపి. 40% కూడా వర్షం నమోదు కాలేదని, వర్షం లేకపోవడంతో రైతుల పంటలు ఎండిపోయి ట్రాక్టర్లతో చెడగొట్టడం జరిగిందన్నారు. మరి కొంతమంది రైతులు మొక్కజొన్న పంటను మేకలకు, గొర్రెలకు వదిలివేయడం జరిగిందన్నారు. రైతులు & కౌలు రైతులకు పంటల పెట్టుబడిగా విత్తనాలు, ఎరువులు, వ్యవసాయ ఖర్చులు ఎకరాకు 40.000 పైనే బ్యాంకు ప్రైవేట్ అప్పులు తీసుకొచ్చి పంటలు సాగుచేసిన చేతికి రాకపోవడంతో రైతులు దిక్కు తోచని పరిస్థితిలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు పంటలు పూర్తిగా నష్టపోయిన రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి అచ్చం నాయుడు లు స్పందించకపోవడం రైతుల పట్ల ఎంత మాత్రం ప్రేమ ఉందో అర్థం అవుతుందన్నారు. తక్షణమే ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి రైతుల నష్టాలను దృష్టిలో ఉంచుకొని పాములపాడు మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలనీ రైతులకు ఎకరాకు 50.000 నష్టపరిహారం ఇవ్వాలని, ప్రతి రైతుకు బ్యాంకుల ద్వారా రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేయాలని, రబి సీజన్లో రైతులు పంటలు వేసుకోవడానికి అన్ని రకాల విత్తనాలను పూర్తి సబ్సిడీతో ఇవ్వాలని, 60 సంవత్సరాలు దాటిన ప్రతి రైతుకు నెలకు పదివేల రూపాయలు పెన్షన్ ఇవ్వాలని, నందికొట్కూరు నియోజవర్గంలో ఉన్న ఎత్తిపోతల పథకాల ద్వారా తక్షణమే సాగు, త్రాగునీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమస్యలను పరిష్కరించకపోతే రాబోయే కాలంలో సిపిఐ( ఎంల్ ) లిబరేషన్ పార్టీ అఖిలభారత కిసాన్ మహాసభ ఆధ్వర్యంలో రైతులను కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నందికొట్కూరు మండల కార్యదర్శి కాటేపోగు స్వామన్న. నాయకులు పిక్కిలి పుల్లయ్య, తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :