ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పగిడ్యాల : వంట మనుషులు అన్నం వడ్డించేటప్పుడు విద్యార్థులతో స్నేహంగా మసులుకోవాలని జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్ లింగాల నాగరాజు హెచ్చరించారు. ఈ సందర్భంగా పగిడ్యాల మండలంలోని, నెహ్రు నగర్ జిల్లా పరిషత్ హైస్కూల్లోని డోక్క సీతమ్మ మధ్యాహ్న భోజనం పరిశీలించి సందర్భంగా లింగాల నాగరాజు మాట్లాడుతూ మధ్యాహ్న సమయంలో అన్నం వడ్డించేటప్పుడు పిల్లలతో స్నేహపూర్వకంగా ఉండాలని ఆయన అన్నారు. మెనూ ప్రకారం సమయానికి అన్నం వడ్డించాలని నాణ్యత పాటించకుండా నిర్లక్ష్యం చేస్తే సహించే ప్రసక్తే లేదని ఆయన హెచ్చరించారు. మండల త్రీ సభ్య కమిటీ పర్యవేక్షణ లేకే వంట మనుషులు హెడ్మాస్టర్లను కూడా బెదిరిస్తున్నారన్నారు. తొందరగా త్రిసభ్య కమిటీ హైస్కూలను సందర్శించకపోతే ఇస్టారాజ్యంగా వ్యవహరిస్తారని వెంటనే కమిటి హైస్కూల్లను తనిఖీ చేయాలని లేదంటే శాసనసభ్యులు గిత్త.జయసుర్య కి, కలెక్టర్ కి ఫిర్యాదు చేసి చర్యలు చేసుకునే విధంగా చేస్తారని ఆయన హెచ్చరించారు.
Admin
E Nivas News