ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రానికి దళిత తొలి ముఖ్యమంత్రిగా పనిచేసిన దామోదరం సంజీవయ్య 105వ జయంతిని పాములపాడులోని, సిపిఎం పార్టీ కార్యాలయంలో, మాల మహానాడు రాయలసీమ అధ్యక్షులు కలబండి.అంకన్న ఆధ్వర్యంలో డివిఎంసి మెంబర్ లింగాల నాగరాజు, సిపిఎం పార్టీ మండల కార్యదర్శి డి.స్వామన్న, సిఐటియు మండల కార్యదర్శి మేకల రాజు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఎస్.షేక్షాఅలీ, బీసీ సంఘం నాయకుడు జి.సాయి కృష్ణ, రజక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు వి.రామకృష్ణుడు, తదితర సంఘాల నాయకులు కలిసి సంజీవయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి, ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరీ కమిటీ మెంబర్ లింగాల.నాగరాజు, మాల మహానాడు రాయలసీమ అధ్యక్షుడు కలబండి.అంకన్న, సిపిఎం పార్టీ మండల కార్యదర్శి- డి.స్వామన్న, సిఐటియు మండల కార్యదర్శి మేకల.రాజు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఎస్.షేక్షాఅలీ, తదితర నాయకులు మాట్లాడుతూ దేశంలో దళిత తొలి ముఖ్యమంత్రిగా ఆంధ్ర రాష్ట్రానికి ఎనలేని సేవలు అందించారని కొనియాడారు. ఎన్నో రాజకీయ పదవులు చేపట్టి అనుభవించినప్పటికీ నిస్వార్ధంగా, నిజాయితీగా, నిరాడంబరంగా జీవించారన్నారు. అంతే కాకుండా ఏఐసీసీ జాతీయ ఉపాధ్యక్షుడిగా, కేంద్ర మంత్రిగా పనిచేశారని గుర్తు చేశారు. ఆయన చేసిన సేవలకు గుర్తుగా కర్నూలు జిల్లాలోని, పెద్దపాడు గ్రామంలో విగ్రహాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఎస్.షేక్షాఅలి, రజక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు వి.రామకృష్ణుడు, ఆటో కార్మిక సంఘం నాయకులు నాగేశ్వరుడు, మల్లికార్జున, బీసీ సంఘం నాయకులు- జి.సాయికృష్ణ సోషల్ మీడియా ప్రతినిధులు గోవిందు డక్క.శ్రీకాంత్, ఎస్.షర్ఫద్దీన్ అలి, తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News