ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల : పి ఆర్ టి యు జిల్లా కార్యాలయంలో, ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ డాక్టర్ గాదె శ్రీనివాసులు నాయుడు పాల్గొని , ఉపాధ్యాయ సమస్యలపై మాట్లాడడం జరిగింది. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్న టెట్ గురించి వారు మాట్లాడుతూ టెట్ పై ఏ ఒక్క ఉపాధ్యాయుడు ఆందోళన చెందవలసిన అవసరం లేదని తెలిపాడు. ప్రతి ఒక ఉపాధ్యాయుడు టెట్ పాస్ అవుతారని, స్కర్ట్ వారితో మేము చర్చించి ఉపాధ్యాయులకు ఒత్తిడి లేకుండా టెట్ పాస్ చేయించేలా రూపొందించిన మాదిరి ప్రశ్నాపత్రాలు ప్రాక్టీస్ చేసినచో ప్రతి ఉపాధ్యాయుడు ఉత్తీర్ణుడు కాగలడని తెలిపారు. ఏ ఒక్క ఉపాధ్యాయున్నీ టెట్ పాస్ కాలేదని ఉద్యోగం నుంచి తొలగించే ప్రసక్తే ఉండదనీ, మీ ఎమ్మెల్సీగా నేను హామీ ఇస్తున్నామని పేర్కొన్నాడు. ఉపాధ్యాయులకు రావలసిన ఆర్థికపరమైన అంశాల గురించి ప్రభుత్వంతో మాట్లాడుతున్నామనీ, త్వరలో శుభవార్త వింటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వీ.కరుణానిధి మూర్తి, కర్నూలు జిల్లా అధ్యక్ష-ప్రధాన కార్యదర్శులు ఎన్ వి.కృష్ణారెడ్డి ఎం.ధనుంజయ, నంద్యాల జిల్లా అధ్యక్ష- ప్రధాన కార్యదర్శులు ఎన్ వి.భాస్కర్ రెడ్డి, ఎస్.చాంద్ బాషా, నాయకులు రాంపకి రెడ్డి, బుగ్గన, వీరారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, ఆదినారాయణ రెడ్డి, సుమాయూన్, మురళి గౌడ్ జకీర్ హుస్సేన్, పి.నూర్ మొహమ్మద్ తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News