ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / ఎన్టీఆర్ జిల్లా : అంగవైకల్యంతో పాటు వివిధ మానసిక శీరిరక రుగ్మతులతో ఇబ్బంది పడే విభిన్న ప్రతిభావంతులు సమస్యల పరిష్కారంపై శ్రద్ద పెట్టాలని వారికి అవసరమైన సౌకర్యం కల్పించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ సంబంధిత అధికారులను ఆదేశించారు. విభిన్న ప్రతిభావంతుల సమస్యల పరిష్కారంపై శుక్రవారం కలెక్టరేట్లోని, ఎవిఎస్ రెడ్డి సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జిల్లా స్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ మాట్లాడుతూ విభిన్న ప్రతిభావంతుల సమస్యలు పరిష్కారంపై శ్రద్ధ పెట్టడంతో పాటు అవసరమైన సౌకర్యాలను తక్షణమే కల్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు. వికాలంగ పిల్లలకు పాఠశాలలో ప్రవేశం అందించాల్సిన సౌకర్యాలపై విద్యా శాఖ అధ్వర్యంలో నోడల్ అధికారిణి నియమించాలన్నారు. వైద్య సహాయంతో పాటు రోగుల సందర్శన కొరకు అసుపత్రికి విచ్చేసే విభిన్న ప్రతిభావంతులకు ర్యాంప్ సౌకర్యం ఉచిత ఆరోగ్య సంరక్షణ చికిత్సలో ప్రాధాన్యత ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిణి ఆదేశించారు. ఉపాధి అవకాశాల కల్పనలో ప్రాధన్యత ఇవ్వాలని నైపుణ్యభివృద్ధి శిక్షణ అందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. సామాజిక భద్రత పరిశుద్ధ్యం జీవనోపాధి కల్పించాలన్నారు. సాంస్కృతిక జీవితం కళాత్మక ప్రతిభ క్రీడలలో ప్రోత్సహాం అందించాలన్నారు. సాంకేతిక సమస్యల కారణంగా మేదోవైకల్యం కలిగిన పిల్లలకు యూడిఐడి కార్డుల పొందడంలో ఎదురయ్యే ఇబ్బందులను పరిష్కరించేందు చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లా న్యాయ సేవల ప్రాధికార సంస్థ కార్యదర్శి, న్యాయ విభాగం వికలాంగులకు న్యాయ సహాయం మరియు న్యాయ సహాయం అందిస్తుందని తెలియజేశారు. ఎన్జీఓలు మరియు అవసరాల జాబితా ద్వారా నిర్వహించబడుతున్న పాఠశాలల్లో వైద్య శిబిరాలను నిర్వహించామని మరియు సంబంధిత విభాగాలతో సమస్పయంతో వాటిని అందించడానికి చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలియజేశారు. గ్రామీణాభివృద్ధి సంస్థ ద్వారా విభిన్న ప్రతిభావంతులకు బుణాలను మంజూరు చేసి ఆర్థికంగా ఎదిగేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అధికారులను అదేశించారు. ఈ సమావేశంలో విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ జిల్లా సహాయ సంచాలకులు వి. కామరాజు, ఐసిడిఎస్- పిడి రుక్సానా సుల్తానా బేగం, డిప్యూటి డిఎంఅందౌచ్వి దా. ఇందుమతి, మెప్మా పిడి- పి.ఎం.కృష్ణప్రసాద్, విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు దేవ నగేష్, ప్రధాన కార్యదర్శి ఫాయిజా బాషా, వివిధ స్వచ్చంద సంస్థల ప్రతినిధులు ఎవిడి- నారాయణరావు, డిఎస్ఆర్- స్వామి, డాక్టర్.కృష్ణకుమారి, కె.రాజేంద్ర, తదితరులు పాల్గొన్నారు. ఈ సమాచారం డీఐపీఆర్వో, ఐ అండ్ పీఆర్, ఎన్టీఆర్ జిల్లా వారి ద్వారా జారీ చేయడం జరిగింది.
Admin
E Nivas News