ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : మండలంలోని,రుద్రవరం గ్రామంలో నూతనంగా నిర్మించబోయే పాఠశాల భవనానికి నందికొట్కూరు శాసనసభ్యులు గిత్త.జయసూర్య, ప్రభుత్వ అధికారులతో, నాయకులతో కలిసి భూమి పూజ నిర్వహించి నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గిత్త.జయసూర్య మాట్లాడుతూ విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించి, నాణ్యమైన విద్యకు అనుకూలమైన వాతావరణం అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. *అనంతరం ఎమ్మెల్యే గిత్త.జయసూర్య కు ఆరోగ్య ఉప కేంద్రానికి స్థలాన్ని కేటాయించాలని కోరుతూ* హెల్త్ సూపర్వైజర్ రత్నమ్మ, ఎమ్ ఎల్ హెచ్.పి- కే.జీ.మమత, ఏఎన్ఎం కే.కృష్ణవేణమ్మ, ఆశ వర్కర్లు ఎం.లక్ష్మీదేవి, కే.సుధారాణి లు వినతి పత్రం సమర్పించడం జరిగింది. *ఇంటింటికి కూటమి ప్రభుత్వం రెండేళ్ల సంక్షేమ పాలన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య* పాములపాడు మండలంలోని, రుద్రవరం గ్రామంలో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ నందికొట్కూరు శాసనసభ్యులు గిత్త.జయసూర్య, ప్రభుత్వ అధికారులతో, నాయకులతో కలిసి డోర్ టు డోర్ ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గిత్త.జయసూర్య, నాయకులు, అధికారులతో కలిసి ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాల వివరాలను ప్రజలకు వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు. ప్రభుత్వం చేపడుతున్న ప్రజాహిత సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో నందికొట్కూరు నియోజవర్గ టిడిపి అబ్జర్వర్ జి.వెంకట శివుడు యాదవ్, టిడిపి మండల కన్వీనర్ రవీంద్రారెడ్డి, భానుముక్కల బండ్లమూరి వెంకటేశ్వరరావు, మద్దూరు జి.తిమ్మరెడ్డి , ఎర్ర గూడూరు చెల్లె.హరినాథ్ రెడ్డి, శివ శంకర స్వామి, పాములపాడు సొసైటీ చైర్మన్ సి.గోవిందు, ఎంపీటీసీ రాచపూడి అరుణ, తెలుగు యువత మండల అధ్యక్షుడు షేక్.కరీం భాషా, నాయకులు రాచపూడి సురేష్ (అడ్వకేట్), టిడిపి బీసీ సెల్ మండల అధ్యక్షుడు కంభం.మోహన్ గౌడు, టిడిపి పాములపాడు మండల కల్చరల్ అధ్యక్షుడు భావన వినోద్ కుమార్, జూటూరు హఫీజ్, నాయిని కృష్ణ, రుద్రవరం మధుసూదన్ రెడ్డి, స్కూల్ కమిటీ చైర్మన్ కరిముల్లా, నాగయ్య, శ్రీనివాసులు, చిన్న వెంకటసుబ్బయ్య, షాలు, అల్లా బకాష్, నాగరాజు, రవీంద్ర, నరేష్, గోవిందు, చిన్న బాబుసా, ఇంతియాజ్, షేక్.రఫీ, షేక్.హుస్సేనాలం, ఉస్మాన్ భాష, మహబూబ్ బాషా, రహంతుల్లా, వాజిద్, రమణయ్య, ప్రభుత్వ అధికారులు ఎంఈఓ-1 బాలాజీ నాయక్, తహసిల్దార్ జి.సుభద్రమ్మ, ఎస్ఐ- పి.తిరుపాలు, ఇన్చార్జి ఎంపీడీవో- సులోచన, విబిజి రాంజీ పథకం ఏపీఓ- బి.జయంతి, ఐకెపి ఎపిఎం- ఏ.ఉమామహేశ్వరి, ఆర్డబ్ల్యూఎస్ జేఈ-సువర్చల, రెవెన్యూ ఇన్స్పెక్టర్ డి.ఖాజాబీ, ఎమ్మెల్యే గవర్నమెంట్ పిఏ- రవీంద్ర, కానిస్టేబుళ్లు ఎం.టావేశ్వరుడు, ఎన్.ఎం.కె.చౌదరి, తదితర ప్రభుత్వ శాఖల అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.
Admin
E Nivas News