ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / ఆత్మకూరు : శ్రీశైలం శాసనసభ్యులు బుడ్డా రాజశేఖరరెడ్డి ఆదేశాలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి కార్పొరేషన్ ఆధ్వర్యంలో మే 2 శనివారం ఆత్మకూరులోని, శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాల నందు జరిగే"మెగా జాబ్ మేళా"పోస్టర్లను, తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో డిపిఓ- సుబ్బన్న, ముఖ్య అతిథులుగా సింగిల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దిన్ పట్టణ, మండలాధ్యక్షులు వేణుగోపాల్, రవీంద్రబాబు మరియు మాజీ మండల అధ్యక్షులు శివ ప్రసాద్ రెడ్డి లు కలిసి ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా సింగిల్ విండో చైర్మన్- ఎ.షహబుద్దీన్, తదితర నాయకులు మాట్లాడుతూ మెగా జాబ్ మేళా నందు 10 కంపెనీల ప్రతినిధులు పాల్గొని, దాదాపు 775 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నారని, ఈ అవకాశాన్ని నియోజకవర్గంలోని నిరుద్యోగ యువతీ, యువకులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. వీరి వెంట క్లస్టర్ ఇంచార్జ్ దినకర్ రావు, టిడిపి సీనియర్ నాయకులు రాం నరసయ్య, చిన్నన్న, శంకర్ శర్మ, గోవర్ధన్ రెడ్డి, శరత్ బాబు, శేషన్న, నాగేంద్రరావు, ఓబులేసు తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News