ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / అనంతపురం : గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ కూలీలకు పేద రైతులకు ఇతర వృత్తిదారులకు పని కల్పించి ఆకలి చావులు నివారణకు వలసలు తగ్గించాలని సిపిఎం పార్టీ మండల కార్యదర్శి డి.స్వామన్న అన్నారు. సోమవారము మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని మోడీ ప్రభుత్వం రద్దు చేసింది వామపక్షాల పార్టీల కృషితోనే ఈ పథకం వచ్చిందని, ఆ స్థానంలో తెచ్చిన కొత్త చట్టాన్ని రద్దు చేయాలని సోమవారం మండలంలోని, చెలిమిళ్ళ, ఇస్కాల, ఎర్రగూడూరు, పాములపాడు గ్రామ కార్యదర్శులకు అర్జీలు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ నాయకులు మాట్లాడుతూ కేంద్రంలో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన మొదలు ఈ పథకము దండగ మారిన పథకం అని పదేపదే విమర్శిస్తూ నిధులు తగ్గిస్తూ వచ్చారు కావున వెంటనే రాంజీ పేరు తొలగించి మహాత్మా గాంధీ పేరుతో ఉన్న ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కమిటీ సభ్యులు ఎస్.బాలయ్య, వీ.రామకృష్ణ, బి.రమణమ్మ, ఎం.బాల యేసు, యస్.ఆర్.వెంకటరమణ, ఆనంద్ గౌడ్, శివన్న, తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News