ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : నంద్యాల జిల్లా పాములపాడు మండలంలోని, ఎర్రగూడూరు గ్రామం సమీపంలో ట్రాక్టర్ బోల్తా పడి పల్నాడు జిల్లా డ్రైవర్ తిరుపతిరావు(35) మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గుంటూరు నుండి కర్నూలుకు వెళుతున్న ట్రాక్టర్ ప్రమాదవశాత్తు బోల్తాపడి గుంటూరు ప్రాంతానికి చెందిన పల్నాడు జిల్లా, సత్తెనపల్లి మండలంలోని, గుడిపూడి గ్రామానికి చెందిన తిరుపతిరావు, తండ్రి వీరయ్య మృతి చెందడం జరిగిందన్నారు. అతడు రాత్రల్లా డ్రైవింగ్ చేయడంతో ఎర్రగుడూరు గ్రామం వద్ద నేషనల్ హైవే ఎన్ హెచ్ 340 సి మీద నిద్రమత్తులో సడన్ బ్రేక్ వేయడంతో ట్రాక్టర్ బోల్తా పడి, ఆ ఇంజన్ కిందనే పడి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నామని పాములపాడు ఎస్సై- పి.తిరుపాలు తెలిపారు.
Admin
E Nivas News