ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : పాములపాడు మండలంలోని, మిట్టకందాల గ్రామంలో ఉన్న ఎస్సీ కాలనీలో ఎమ్మెల్యే గిత్త.జయసూర్య సహకారంతో నూతన బోరుకు శ్రీకారం చుట్టినట్టు టిడిపి మండల ప్రధాన కార్యదర్శి జి.హరిప్రసాద్ యాదవ్ తెలియజేశారు. ఈ సందర్భంగా టిడిపి మండల ప్రధాన కార్యదర్శి & మాజీ సర్పంచ్ జి.హరిప్రసాద్ యాదవ్ మాట్లాడుతూ ఎల్వినో ప్రభావం వలన వర్షాలు పడక గ్రామంలో తీవ్ర తాగునీటి ఎద్దడి ఏర్పడిందని, ఈ విషయాన్ని నంద్యాల పార్లమెంట్ టిడిపి ఇన్చార్జ్ మాండ్ర శివానందరెడ్డి, ఎమ్మెల్యే గిత్త.జయసూర్య లకు తెలపగా, వారు స్పందించి నూతన బోర్లకు పర్మిషన్ ఇవ్వడం జరిగిందన్నారు. ఈ కొత్త బోర్ల వలన గ్రామంలో ఏర్పడిన ప్రజల నీటి బాధలకు ఊరట లభిస్తుందన్నారు. గ్రామంలోని, ప్రజల సమస్యల పరిష్కారానికి అందరు నాయకులతో కలిసి అభివృద్ధి కోసం పనిచేస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు శ్రీను, కార్యకర్తలు బుడ్డన్న, వెంకటయ్య, ప్రభాకర్, నియాజ్, మధు, తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News