ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : నంద్యాల జిల్లా, నందికొట్కూరు నియోజకవర్గం, పాములపాడు మండలంలోని, మిట్టకందాల గ్రామంలో 205వ బూత్ నందు ఇన్చార్జి లింగాల శివ రాముడు ఆధ్వర్యంలో కార్యకర్తలతో కలిసి ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా బూత్ ఇన్చార్జి లింగాల శివరాముడు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో సాధించిన ప్రగతిని, ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికీ వెళ్లి వివరించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల అమలు తీరును, ప్రభుత్వం చేపట్టిన వివిధ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో 205వ బూత్ ఇన్చార్జి లింగాల శివరాముడు, లింగాల అబ్రహాం, లింగాల దేవరాజు, తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News