ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / వెలుగోడు : దివ్యాంగుల జీవనోపాధికి అండగా నిలుస్తూ వారి స్వయం సమృద్ధికి ఎన్డీయే కూటమి ప్రభుత్వం తోడ్పటును అందిస్తుందని శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం వెలుగోడు మండలంలోని, వేల్పనూరు గ్రామంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహకారంతో, విభిన్న ప్రతిభావంతుల సహాయ సంస్థ ఆధ్వర్యంలో శ్రీశైలం నియోజకవర్గానికి చెందిన 10 మంది దివ్యాంగ లబ్ధిదారులకు ఉచితంగా మంజూరైన రెట్రోఫిట్టెడ్ స్కూటర్లను ఆయన పంపిణీ చేశారు. దాదాపు రూ.1.30 లక్షల విలువైన ఒక్కో ప్రత్యేక స్కూటీ దివ్యాంగుల రోజువారీ ప్రయాణాలకు, ఉపాధి అవకాశాలను మెరుగుపరచుకోవడానికి ఎంతో ఉపయోగపడతాయని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా దివ్యాంగులు మాట్లాడుతూ తమ జీవితాల్లో కొత్త వెలుగులు నింపిన ఈ సహాయానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి లకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలు తమలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడంతో పాటు స్వయం ఉపాధి వైపు అడుగులు వేయడానికి దోహదపడతాయని పేర్కొన్నారు.
Admin
E Nivas News