Monday, 14 September 2026 03:34:58 AM
# మహిళల నాయకత్వాన్ని బలపరచండి... మాదిగ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు నందిని # నీటి సంఘం అధ్యక్షులు తిమ్మారెడ్డి కృషితో మద్దూరు కుంటకు కేసీ.కెనాల్ జలాలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఆశీర్వదించండి...! ఆత్మకూరు సింగల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దిన్ # పాములపాడులో ఘనంగా కామ్రేడ్ సీతారాం ఏచూరి రెండవ వర్ధంతి # ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పి ఆర్ టి యు నంద్యాల జిల్లా శాఖ ప్రాతినిధ్యం # కార్మికుడి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు... సింగరేణి భద్రతా ప్రమాణాలపై ఎంపీ హెచ్చరిక... # ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజకు ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారానికి ఎంపిక.. # ఫ్రీ బస్సు వద్దని మహిళల రాస్తారోకో.. # ఆర్థిక ఇబ్బందులతో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు జగన్ ఆత్మహత్య... # దసరా నుంచి లబ్ధిదారులకుకొత్త పింఛన్లు పంపిణీ... # శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్..

జిల్లాస్థాయి పీజీఆర్ఎస్‌కు 192 అర్జీలు ఇందులో 54 రెవెన్యూ, 138 నాన్ రెవెన్యూ అర్జీలు..! ప్ర‌తి అర్జీకి ప్ర‌త్యేక దృష్టితో ప‌రిష్కారం చేస్తాం

జిల్లా జాయింట్ క‌లెక్ట‌ర్ ఎస్‌.ఇల‌క్కియ‌

Date : 10 February 2026 09:05 AM Views : 188

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / ఎన్టీఆర్ జిల్లా : రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌తిష్టాత్మ‌క ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కార వేదిక (పీజీఆర్ఎస్‌) జిల్లాస్థాయి కార్య‌క్ర‌మం ద్వారా మొత్తం 192 అర్జీలు వ‌చ్చాయని.. వీటిలో 54 రెవెన్యూ అర్జీలు కాగా, 138 రెవెన్యూయేత‌ర అర్జీలు ఉన్న‌ట్లు జిల్లా జాయింట్ క‌లెక్ట‌ర్ ఎస్‌.ఇల‌క్కియ తెలిపారు. సోమ‌వారం క‌లెక్ట‌రేట్‌లో జ‌రిగిన జిల్లాస్థాయి పీజీఆర్ఎస్ కార్య‌క్ర‌మంలో జాయింట్ క‌లెక్ట‌ర్ ఎస్‌.ఇల‌క్కియ‌.. అధికారుల‌తో క‌లిసి ప్ర‌జ‌ల నుంచి అర్జీలు స్వీక‌రించారు. నాన్ రెవెన్యూ అర్జీల్లో పుర‌పాల‌క శాఖ‌కు సంబంధించి 31, పోలీసు శాఖ‌కు 27, డీఆర్‌డీఏకు 25, పంచాయ‌తీరాజ్ శాఖ‌కు 12 అర్జీలు వ‌చ్చాయ‌న్నారు. విద్యుత్‌, పౌర స‌ర‌ఫ‌రాలు, ఆరోగ్య శాఖ‌ల‌కు అయిదు చొప్పున అర్జీలు రాగా సీఆర్‌డీఏకు సంబంధించి నాలుగు అర్జీలు వ‌చ్చిన‌ట్లు వెల్ల‌డించారు. వ్య‌వ‌సాయం, ఇరిగేష‌న్‌కు మూడు చొప్పున అర్జీలు రాగా, విద్య‌, నైపుణ్యాభివృద్ధి, స‌ర్వే, సాంకేతిక విద్య‌కు రెండు చొప్పున అర్జీలు వ‌చ్చాయ‌న్నారు. ప్ర‌జా ర‌వాణా, ఎండోమెంట్‌, మైనారిటీ సంక్షేమం, ఎల్‌డీఎం, ప‌రిశ్ర‌మ‌లు, మైన్స్‌, కాలుష్య నియంత్ర‌ణ‌, రిజిస్ట్రేష‌న్ అండ్ స్టాంప్స్‌, గ్రామీణ నీటి స‌ర‌ఫ‌రా, ర‌హ‌దారులు-భ‌వ‌నాల శాఖ‌ల‌కు ఒక‌టి చొప్పున అర్జీలు వ‌చ్చాయ‌ని వివ‌రించారు. ప్ర‌తి అర్జీపైనా ప్ర‌త్యేకంగా దృష్టిసారించి నిర్దేశ గ‌డువులోగా ప‌రిష్క‌రించాల‌ని జాయింట్ క‌లెక్ట‌ర్ ఇల‌క్కియ ఆయా శాఖ‌ల అధికారుల‌ను ఆదేశించారు. అర్జీదారులు సంతృప్తి చెందేలా స‌మ‌స్య‌కు స‌రైన ప‌రిష్కారం చూప‌డంలో చిత్త‌శుద్దితో ప‌నిచేయాల‌ని సూచించారు. ఈ సమాచారం డీఐపీఆర్‌వో, ఐ అండ్ పీఆర్‌, ఎన్‌టీఆర్ జిల్లా వారి ద్వారా జారీ చేయడం జరిగింది.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :