ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / ఆత్మకూరు : ఆత్మకూరు పట్టణంలోనీ, తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నందికొట్కూరు శాసనసభ్యులు గిత్త.జయసూర్య ఎస్ఐఆర్ ప్రక్రియపై కొత్తపల్లి, పాములపాడు మండలాల బిఎల్ఎ లతో అవగాహన సదస్సు (వర్క్ షాప్) నిర్వహించడం జరిగింది. ఈ వర్క్‌షాప్‌లో ఎస్ఐఆర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్, వర్కషాప్ ) పక్రియ పై క్షుణ్ణంగా వివరించారు, త్వరలో జరిగే స్థానిక సంస్థలు ఎన్నికలలో టీడీపీ అనుసరించాల్సిన పలు కీలక అంశాలపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా వర్క్ షాప్ లో పార్టీ శ్రేణులు పార్టీ నాయకులంతా ఇంటింటికీ వెళ్లాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేసినట్లు పేర్కొన్నారు. దీనిలో భాగంగా కూటమి ప్రభుత్వానికి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా జరిగిన అభివృద్ధి, నెరవేర్చిన హామీలను, రాబోయే మూడేళ్లలో ఏం చేస్తామో ప్రజలకు వివరించాలని పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘన విజయానికి వ్యూహాలు, వైసీపీ విషప్రచారాన్ని ధీటుగా తిప్పికొట్టడంపై గ్రామస్థాయిలో విస్తృత ప్రచారం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండలం టీడీపీ అధ్యక్షులు రవీంద్ర రెడ్డి, హరినాథ్, గోవింద్,టిడిపి బీసీ సెల్ మండల అధ్యక్షుడు కంభం.మోహన్ గౌడ్, డివిఎంసి మెంబర్ లింగాల నాగరాజు, తెలుగు యువత మండల అధ్యక్షుడు షేక్.కరీం భాష, వేంపెంట బూత్ కన్వీనర్ బోనపల్లె వినయ్ కుమార్, రుద్రవరం రాచపూడి సురేష్, జూటూరు హఫీజ్, మాండ్ర సేవాదళ్ మండల అధ్యక్షుడు భావన రాము, మండలం తెలుగు కల్చరల్ అధ్యక్షులు భావన వినోద్ కుమార్,ఎర్రగూడూరు, శివ శంకర్ స్వామి, ఎమ్మెల్యే గవర్నమెంట్ పిఏ- రవీంద్ర, పాములపాడు, కొత్తపల్లి మండలాలలోని, బిఎల్ఏ లు లు మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
Admin
E Nivas News