ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / ఆత్మకూరు : ఆత్మకూరు పట్టణానికి చెందిన ఆర్యవైశ్య ప్రముఖులు, కీర్తిశేషులు పెసల హరిబాబు కుమార్తె పెసల ప్రియంవద ఇటీవల విడుదలైన గ్రూప్-1 ఫలితాలలో సబ్ కలెక్టర్‌గా ఎంపికై తన ప్రతిభను చాటారు. అత్యున్నత పదవికి ఎంపికైన తర్వాత ఆమె మొదటిసారిగా తన సొంత గడ్డ ఆత్మకూరుకు విచ్చేస్తున్న సందర్భంగా పట్టణంలో పండుగ వాతావరణం నెలకొంది. *మండల సంఘం అధ్యక్షులు సేగు కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో సన్మానం* ప్రియంవద అద్భుత విజయంపై ఆత్మకూరు మండల ఆర్యవైశ్య సంఘం హర్షం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు సేగు కిరణ్ కుమార్ మాట్లాడుతూ.. ప్రియంవద సాధించిన విజయం ఆర్యవైశ్యులకు మాత్రమే కాకుండా, మొత్తం పట్టణానికే గర్వకారణమని కొనియాడారు. ఈ గొప్ప విజయాన్ని పురస్కరించుకొని, ఆత్మకూరు మండల సభ్యులందరి తరపున ఆమెను చిరు సత్కారంతో ఘనంగా సన్మానించాలని సేగు కిరణ్ కుమార్ నిర్ణయించారు. ఈ సన్మాన కార్యక్రమం పురస్కరించుకుని బుధవారం ఉదయం 10 గంటలకు ఆత్మకూరు పట్టణంలోని, కిరణ్ జనరల్ స్టోర్ వద్దకు ఆర్యవైశ్య సంఘం కమిటీ సభ్యులందరూ హాజరు కావాలని అధ్యక్షులు సేగు కిరణ్ కుమార్ పిలుపునిచ్చారు. అందరూ కలిసికట్టుగా వెళ్లి మన ముద్దుబిడ్డకు అపూర్వ స్వాగతం పలికి, సత్కరించుకుందామని ఆయన కోరారు. ఈ విజయం భవిష్యత్ తరాలకు, ముఖ్యంగా సివిల్స్ మరియు గ్రూప్స్ కోసం సిద్ధమవుతున్న విద్యార్థులకు గొప్ప స్ఫూర్తినిస్తుందని స్థానిక ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు.
Admin
E Nivas News