Wednesday, 29 July 2026 09:07:03 PM
# తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది...

ఎర్రగూడూరు తెలుగు గంగా బ్రిడ్జిపై నాణ్యత లోపాలు

మాల మహానాడు రాయలసీమ అధ్యక్షుడు కే.అంకన్న

Date : 25 May 2026 09:34 AM Views : 129

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : పాములపాడు:-పాములపాడు మండలంలోని, ఎర్రగూడూరు గ్రామం వద్ద తెలుగు గంగ బ్రిడ్జిపై నాణ్యత లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని మాల మహానాడు రాయలసీమ అధ్యక్షుడు కలబండి.అంకన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రోజు మాల మహానాడు రాయలసీమ అధ్యక్షులు కే.అంకన్న ఎర్రగూడూరు వద్ద తెలుగు గంగ బ్రిడ్జిపై పి ఎస్ కే కంపెనీ వారు వేసిన నేషనల్ హైవే ఎన్ హెచ్ 340 సి రోడ్డును పరిశీలించగా కాంక్రీట్ పోయి, లోపల ఉన్న కడ్డీలు బయటపడి రోడ్డు పాడవుతూ వస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కర్నూలు నన్నూరు చెక్పోస్ట్ నుండి ఆత్మకూరు రైస్ మిల్లుల వరకు పి ఎస్ కే కంపెనీ వారు వేసిన జాతీయ రహదారి నిర్మాణాల నాణ్యతను అధికారులు పట్టించుకోకపోవడం వలన అక్కడక్కడ ఇటువంటి నాణ్యత లోపాలు కనిపిస్తున్నాయని అన్నారు. ఇప్పటికైనా ఈ రోడ్డును నేషనల్ హైవే అధికారులు పరిశీలించి, ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయో కంపెనీవారు నాణ్యతగా వేసే విధంగా చూడాలని కోరారు. *ఎర్రగూడూరు తెలుగు గంగ బ్రిడ్జి ప్రాముఖ్యత* జాతీయ మాల మహానాడు కలబండి.అంకన్న మాట్లాడుతూ ఎర్రగూడూరు దగ్గర తెలుగు గంగ బ్రిడ్జి దగ్గర.. ప్రతి సంవత్సరం వినాయక చవితి సందర్భంగా అనేక వినాయక విగ్రహాలు మరియు పెద్ద ఎత్తున ప్రజలు వినాయక విగ్రహాలు నిమజ్జనం ప్రతి సంవత్సరం చేస్తారు. మరియు ఇదే నూతన బ్రిడ్జి మీదుగా కర్నూలు నుండి విజయవాడ కి భారీ మెట్రిక్ టన్నుల లోడ్ లతో వస్తూ ఉంటాయి. కాబట్టి ఇలాంటి వి జరిగినప్పుడు. నాణ్యత లోపం వలన ఏదైనా జరగరాని సమస్య జరిగితే బ్రీడ్ కి ఏమైనా జరిగితే ఎవరు బాధ్యులు అమాయకపు ప్రజలను ఇలా బ్రిడ్జి లలో ప్రమాదాలు జరగకుండా చూడాలని అన్నారు. *భానుముక్కల టర్నింగ్ దగ్గర హైవే వారు మూసివేసిన రహదారినీ వెంటనే తొలగించాలి- ప్రయాణాన్ని సురక్షితం చేయాలి* భానుముక్కల టర్నింగ్ దగ్గర హైవే వారు నిత్యం భానుముక్కల ప్రజలు అందరూ కలిసి ప్రతి రోజు ప్రయాణిస్తుంటారు. కాబట్టి హైవే వారు మూసినటువంటి రహదారిను వెంటనే తొలగించాలన్నారు. నేషనల్ హైవే అధికారులు, పి ఎస్ కే కంపెనీ వారు ప్రజలు ఇబ్బందులు కలుగ కుండా చూడాలని కోరడమైనది. అంతేకాకుండా ఎప్పటి నుండో పూర్వం నుండి కూడా ఇక్కడ బస్ స్టాప్ ఉన్నదన్నారు. ఇక్కడ ఒక భానుముక్కల ఒక్కటే కాదు బానకచర్ల , వేంపెంట, వెలుగోడు, నంద్యాల వరకు నిత్యం ప్రయాణిస్తూ ఉంటారనీ మరియు మజారా గ్రామాలు కలిసి ఉన్నాయన్నారు. కాబట్టి ఇది ఇలాగే ఉంటే బారి ఎత్తున నిరసన వ్యక్తం చేస్తామని హెచ్చరించారు.ప్రజలకు ఇబ్బంది కలుగకుండా ఈ కూటమి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకోవాలని మాల మహానాడు రాయలసీమ అధ్యక్షుడు కలబండి అంకన్న కోరడమైనది.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: