ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / ఆత్మకూరు : ఆత్మకూరు మండలంలోని, కొట్టాలచెరువు గ్రామానికి చెందిన మండ్ల రాఘవేంద్ర, మండ్ల నాగమణి దంపతుల కుమారుడు మండ్ల ప్రసాద్ జాతీయ స్థాయిలో జరిగిన సీనియర్ ఖోఖో ఆటలో పాల్గొనడం జరిగింది. మండ్ల ప్రసాద్ కు తల్లిదండ్రులతోపాటు బంధువులు, గ్రామస్తులు అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులు మాట్లాడుతూ తమ కుమారుడు చదువుతోపాటు చక్కని క్రమశిక్షణతో ఆటలలో రాణిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని తెలియజేశారు. ఈ నెల 11 నుండి 15 వరకు తెలంగాణ రాష్ట్రంలోని, ఖాజీపేటలో జాతీయ స్థాయి ఖోఖో ఆటలో పాల్గొన్న క్రీడాకారుడికి ఆత్మకూరు డిఎస్పి- ఆర్.రామాంజి నాయక్ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా డీఎస్పీ- ఆర్.రామాంజీ నాయక్ మాట్లాడుతూ గ్రామీణ క్రీడాకారులకు జాతీయ స్థాయిలో రాణించిన వాళ్లకు అన్ని రకాల సహాయ, సహకారాలు అందిస్తామని తెలియజేశారు. గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు జాతీయ స్థాయి ఆటల పోటీల్లో పాల్గొని, రాణించడం హర్షించదగ్గ విషయం అని అన్నారు. క్రీడాకారుడు మాండ్ల.ప్రసాద్ కు ఆత్మకూరు అర్బన్ సీఐ- మహేశ్వర్ రెడ్డి, ఎస్సై- నారాయణరెడ్డి, గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు జవహార్ నాయక్, టీడీపి నాయకులు అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు టిడిపి నాయకులు, కొట్టాలచెరువు గ్రామ సర్పంచ్ నాగలక్ష్మి, గ్రామస్తులు, గిరిజన సంఘ నాయకులు పాల్గొనడం జరిగింది.
Admin
E Nivas News