ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : పాములపాడు మండలంలోని, వేంపెంట గ్రామంలో సింగిల్ విండో చైర్మన్ లక్ష్మీకాంతరెడ్డి, టిడిపి మండల బీసీ సెల్ అధ్యక్షుడు కంభం.మోహన్ గౌడ్ ల ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి & యువ పురుషుడు నందమూరి తారక రామారావు 30 వ వర్ధంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి ఇతర టిడిపి నాయకులతో, కార్యకర్తలతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వేంపెంట సొసైటీ చైర్మన్ లక్ష్మీకాంతరెడ్డి, పాములపాడు మండల టిడిపి బీసీ సెల్ అధ్యక్షుడు కంభం.మోహన్ గౌడ్, తదితర నాయకులు మాట్లాడుతూ నందమూరి తారక రామారావు సినిమాలలో యుగపురుషుడుగా, విశ్వవిఖ్యాత నటసార్వభౌముడుగా అందరికీ సుపరిచితుడని అన్నారు. ఎన్టీఆర్ అనేది ఒక పేరు కాదు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఒక ప్రభంజనం అని అన్నారు. ఆయన ఒక సంచలనం, తెలుగువాడి విశ్వరూపం. వెండితెరపై రారాజుగా వెలుగొందిన మహానటుడని అన్నారు. రాజకీయాల్లో కూడా మహానాయకుడిగా రాణించి, గొప్ప మెజారిటీతో ముఖ్యమంత్రిగా గెలుపొందడం జరిగిందన్నారు. ఎన్టీ రామారావు తెలుగుదనానికి ప్రతిరూపంగా నిలిచారని అన్నారు. ఆయన ఒక తెలుగుజాతి ఆత్మగౌరవం, సామాజిక న్యాయం, ప్రజాసంక్షేమం అనే సిద్ధాంతాలపై తెలుగుదేశం పార్టీ నిర్మితమైందన్నారు. ఎన్టీ రామారావు సమాజమే దేవాలయం --ప్రజలే దేవుళ్లని నినదించిన గొప్ప వ్యక్తి అని అన్నారు. కోట్లాది హృదయాల్లో కొలువైన ఎన్టీఆర్ నాకు నిత్యస్ఫూర్తి, మనకందరికీ ఆదర్శప్రాయుడు అన్నారు. ఆయన అడుగుజాడలలో మనమందరం నడిచి ప్రజల కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మూల.లేనిన్ బాబు బాలస్వామి, శంకర్ రాముల నాయక్, చిన్నదరగయ్య, రామ్మోహన్ రెడ్డి, జనార్ధన్ నాయక్, స్వామినాయుడు గోపాలయ్య గొల్ల.బుజ్జి, బోయ.జనార్దన్, సామన్న నాయక్, డాక్టర్ నరసింహుడు, వెంకటరాముడు, రాంబాబు నాయక్, తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.
Admin
E Nivas News