ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / ఆత్మకూరు : "మెగా పేరెంట్స్ డే"మీటింగ్ కు వచ్చిన శ్రీశైలం శాసనసభ్యులు బుడ్డా రాజశేఖరరెడ్డి ని బాలిక ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు, విద్యా కమిటీ చైర్మన్ ఎం.ఖాజావలి మరియు ఉపాధ్యాయ బృందం కలిసి తమ తమ పాఠశాలకు ఆధునిక కంప్యూటర్ మరియు సౌండ్ సిస్టం కావాలని కోరగా వెంటనే స్పందించి, తన సొంత డబ్బులు మంజూరు చేసి నేడు ఎంఈఓ లు మేరీ మార్గరెట్, ఎం.అయూబ్ ల సమక్షంలో ఆత్మకూరు పట్టణ అధ్యక్షుడు వేణుగోపాల్, సొసైటీ చైర్మన్ ఎ.షహబుద్దీన్ మరియు స్థానిక తెలుగుదేశం నాయకుల ఆధ్వర్యంలో హెచ్ఎం కి అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ సమస్యను వెంటనే పరిష్కరించినందుకు శాసనసభ్యులు బుడ్డా రాజశేఖరరెడ్డి కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో పి ఈ టి శంకర్, ఉపాధ్యాయ బృందం, స్థానిక నాయకులు సాయి, వలి ఖాన్, అమృల్లా, నగేష్, రజాక్, టపాల్ జహిద్ ఆలి, మా భాష, తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News