ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / ఆత్మకూరు : ఆత్మకూరు పట్టణంలోని, ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన జాతీయ పల్స్ పోలియో కార్యక్రమంలో కంటి వైద్య నిపుణులు పి.షేక్షావలి, మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఎం.ఆయుబ్ అహమ్మద్ లు పాల్గొని, పిల్లలకు చుక్కలు వేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎంఈఓ-ఎం.ఆయుబ్ అహమ్మద్, కంటి వైద్య నిపుణులు పి.షేక్షావలి లు మాట్లాడుతూ ఐదు సంవత్సరాల లోపు ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు తప్పనిసరిగా వేయాలని తెలిపారు. పిల్లల ఆరోగ్యం భద్రమైతేనే సమాజ భవిష్యత్తు బలంగా ఉంటుందని పేర్కొంటూ, తల్లిదండ్రులు ఎవ్వరూ నిర్లక్ష్యం చేయకుండా తమ పిల్లలకు పోలియో చుక్కలు వేయించాలని పిలుపునిచ్చారు. పల్స్ పోలియో కార్యక్రమం ద్వారా పోలియోను పూర్తిగా నిర్మూలించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. అదేవిధంగా ఈ కార్యక్రమంలో వారు స్వయంగా చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఈ కార్యక్రమంలో వైద్య–ఆరోగ్యశాఖ సిబ్బంది, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
Admin
E Nivas News