ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/మహానంది : మహానంది మండలంలోని, మహానందీశ్వర స్వామి దేవస్థానం ప్రమాణ స్వీకారం చేసిన నూతన పాలక మండలి చైర్మన్ మౌళిశ్వర రెడ్డి, సభ్యులకు ఎమ్మెల్యే బుడ్డా.రాజశేఖర్ రెడ్డి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ మహానంది దేవస్థాన ఆధ్యాత్మిక ప్రాశస్త్యాన్ని కాపాడుతూ, భక్తులకు మెరుగైన వసతులు కల్పించడమే ప్రధాన ధ్యేయంగా పని చెయ్యాలని అన్నారు. మహాదేవుని సన్నిధికి వచ్చే ప్రతి భక్తుడికీ సౌకర్యవంతమైన దర్శనం మరియు సేవలు అందించడంలో పాలకమండలి నిరంతరం శ్రమించాలనీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి పిలుపునిచ్చారు.
Admin
E Nivas News