Sunday, 13 September 2026 12:58:03 AM
# శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్.. # కోతులను పారద్రోలడానికి కొండెంగ అవతారం ఎత్తిన ఉపసర్పంచ్ # కొండగట్టు బస్ ప్రమాద విషాదానికి నేటికి ఎనిమిదేళ్ళు... # అడవుల సంరక్షణలో అటవీ అధికారుల పాత్ర కీలకమైనది.. కలెక్టర్ కుమార్ దీపక్ # ఓటర్ల ధ్రువపత్రాల పరిశీలన వేగవంతంగా చేయాలి.. కలెక్టర్ కుమార్ దీపక్ # ఘనంగా పోలాల అమావాస్య’ వేడుకలు.. ఎద్దులను అందంగా అలంకరించి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు.. # పాఠశాలల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలి.. కలెక్టర్ యువరాజ్ మర్మత్.. # ఆత్మహత్యల నివారణ దినం పోస్టర్ ఆవిష్కరణలో జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి.గితే.. # పోలీస్–అటవీ శాఖల మధ్య మరింత సమన్వయంతో అటవీ సంపద, వన్యప్రాణుల రక్షణకు చర్యలు తీసుకుంటాం... ఎస్పి అశోక్ కుమార్.. # హియరింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలి... కలెక్టర్ కుమార్ దీపక్ # చిట్యాల ఐలమ్మ పోరాట స్ఫూర్తిని నేటి యువతరం ఆదర్శంగా తీసుకొని సమాజంలో ఆర్థిక అసమానతల నిర్మూలనకై కృషి చేయాలి

బ్రిటిష్ వారిపై వడ్డే ఓబన్న పోరాటం స్ఫూర్తిదాయకం

సామాజికవేత్త, బీసీ సంఘం నేత డాక్టర్ డి.నాగన్న, ఏపీ వడ్డెర సంఘం జిల్లా అధ్యక్షులు ఓర్సు రామసుబ్బయ్య

Date : 11 January 2026 07:46 PM Views : 295

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / ఆత్మకూరు : బ్రిటిష్ వారిపై వడ్డె ఓబన్న పోరాటం స్ఫూర్తిదాయకమని బీసీ సంఘం రాష్ట్ర నాయకులు డాక్టర్ డి.నాగన్న, ఏపీ వడ్డెర సంఘం జిల్లా అధ్యక్షులు ఓర్సు రామసుబ్బయ్య అన్నారు. ఆదివారం ఆత్మకూరు పట్టణంలోని, బీసీ సంఘం కార్యాలయంలో రేనాటి వీరుడు, తొలితరం స్వాతంత్ర సమరయోధుడు వడ్డే ఓబన్న 219వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా ఏపీ వడ్డెర సంఘం జిల్లా అధ్యక్షులు ఓర్సు రామసుబ్బయ్య, ఏపీ వడ్డెర సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు గోగుల తిమ్మయ్య, ఏపీ వడ్డెర యువజన సంఘం జిల్లా అధ్యక్షులు పల్లపు మౌలాలి, సామాజిక రాయలసీమ రాష్ట్ర సాధన సమితి అధ్యక్షుడు & సామాజిక వేత్త డాక్టర్ డి.నాగన్న, రామకృష్ణ, వీరన్న, వెంకటస్వామి గౌడ్, ఈ.శివన్న గౌడ్, రమణ, శివ తదితరులు వడ్డె ఓబన్న చిత్రపటానికి పూలమాలలు వేసి, వడ్డె ఓబన్న పోరాట స్పూర్తిని స్మరించుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన సామాజిక రాయలసీమ రాష్ట్ర సాధన సమితి అధ్యక్షుడు & సామజిక వేత్త డాక్టర్ డి.నాగన్న మాట్లాడుతూ రేనాటి వీరుడు, తొలితరం స్వాతంత్ర సమరయోధుడు వడ్డే ఓబన్న స్ఫూర్తిని బీసీలు ఆదర్శంగా తీసుకొని తమ హక్కుల కోసం ఉద్యమించాలని అన్నారు. బీసీలు సంఘటితమై అందులోని కులాల హక్కులు ఐక్యమత్యంతో సాధించుకోవాలని సూచించారు. గ్రామ స్థాయి నుంచి బీసీలు బలోపేతం కావాలని పిలుపునిచ్చారు. అనంతరం ఏపీ వడ్డెర సంఘం జిల్లా అధ్యక్షులు ఓర్సు రామసుబ్బయ్య మాట్లాడుతూ వడ్డె ఓబన్న 1807, జనవరి-11న నంద్యాల జిల్లా సంజామల ప్రాంతంలో రేనాటి గడ్డపై జన్మించారని, ఉయ్యాలవాడ నరసింహరెడ్డి కి సైన్యానికి సైన్యాధ్యక్షునిగా ఉంటూ రైతు బట్వారీ వ్యవస్థపై బ్రీటీష్ వారికి వ్యతిరేకంగా ఎన్నో పోరాటాలు చేసి వీరమరణం పొందారని గుర్తు చేశారు. వడ్డె ఓబన్న బోయలను, చెంచులను, అణగారిన వర్గాలను సమన్వయం చేసుకొని బ్రీటీష్ పాలకులపై పోరాటాల చేసి ధీటుగా బదులిచ్చిన వీరుడని కొనియాడారు. వడ్డె ఓబన్నను ఆదర్శంగా తీసుకొని వడ్డెరులు తమ హక్కుల సాధనకై ఉద్యమించాలని సూచించారు. అంతేకాకుండా స్వాతంత్ర సమరయోధుడు వడ్డె ఓబన్న జీవిత చరిత్రను ప్రభుత్వ పాఠ్యపుస్తకాల్లో చేర్చాలని కోరారు. వడ్డెరులు ఐక్యమత్యంతో మెలగాలని, వడ్డె ఓబన్న విగ్రహాలను ప్రధాన కూడళ్ళలో ఏర్పాటు చేసే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వడ్డెర సంఘం నాయకులు చంద్రగిరి మల్లేష్, పల్లపు హుశేనయ్య, బీసీ సంఘం నాయకులు లక్ష్మణ్ సింగ్, శ్రీహరి, పెద్దన్న, శ్రీరామ్, శివపాములేటి, వెంకటేశ్వర నాయక్, ఆత్మకూరు డివిజనల్ ఎస్సీ,ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు దూదేకుల మీరాసాహెబ్, మరాఠి సంఘం జిల్లా అధ్యక్షులు రేకంధర్ సాయికృష్ణ, వైసీపీ నాయకులు మాబాష తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :