Tuesday, 15 September 2026 03:11:39 AM
# మహిళల నాయకత్వాన్ని బలపరచండి... మాదిగ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు నందిని # నీటి సంఘం అధ్యక్షులు తిమ్మారెడ్డి కృషితో మద్దూరు కుంటకు కేసీ.కెనాల్ జలాలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఆశీర్వదించండి...! ఆత్మకూరు సింగల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దిన్ # పాములపాడులో ఘనంగా కామ్రేడ్ సీతారాం ఏచూరి రెండవ వర్ధంతి # ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పి ఆర్ టి యు నంద్యాల జిల్లా శాఖ ప్రాతినిధ్యం # కార్మికుడి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు... సింగరేణి భద్రతా ప్రమాణాలపై ఎంపీ హెచ్చరిక... # ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజకు ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారానికి ఎంపిక.. # ఫ్రీ బస్సు వద్దని మహిళల రాస్తారోకో.. # ఆర్థిక ఇబ్బందులతో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు జగన్ ఆత్మహత్య... # దసరా నుంచి లబ్ధిదారులకుకొత్త పింఛన్లు పంపిణీ... # శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్..

ఆత్మకూరులోని సమీకృత బాలుర వసతి గృహాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన డివిఎంసి మెంబర్ లింగాల నాగరాజు

ఇంటిగ్రేటెడ్ హాస్టల్ వార్డెన్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం 12-30 పెట్టవలసి ఉండగా 2 గంటలకు పెట్టడం ఎంత నిర్లక్ష్యం

Date : 17 November 2025 10:11 AM Views : 261

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / ఆత్మకూరు : సమీకృత ఇంటిగ్రేటెడ్ బాలుర వసతి గృహంలో పనిచేసే వార్డెన్ పై చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్ లింగాల.నాగరాజు అధికారులను డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆత్మకూరు పట్టణంలోనీ, దుద్యాల రోడ్డులో ఉన్న సమీకృత ఇంటిగ్రేటెడ్ హాస్టల్ ను నంద్యాల జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్ లింగాల.నాగరాజు ఈ హాస్టల్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హాస్టల్లో సరైన సమయానికి పిల్లలకు భోజనం పెట్టకుండా 12:30 కు పెట్టాల్సిన మధ్యాహ్నం భోజనం దాదాపు రెండు గంటల ప్రాంతంలో భోజనాలు పెట్టడం దారుణం అన్నారు. 50 మంది విద్యార్థులకు మూడున్నరకిలోల చికెన్ పెట్టడం ఎంతవరకు సమంజసమని ఎద్దేవా చేశారు. బాత్రూములకు డోర్లు లేక పిల్లలు ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. హాస్టల్ వార్డెన్ నిర్లక్ష్యం చాలా ఉందని కనీసం ఉదయం టిఫిన్ చేసిన టైం నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు త్రాగునీరు లేక పిల్లలు ఇబ్బందులకు గురవుతున్న పట్టించుకునే నాధుడే ఇక్కడ లేడని ఆయన అన్నారు. పుచ్చిపోయిన కూరగాయలు వండి విద్యార్థులకు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత మూడు నెలల నుండి హాస్టల్ మరమ్మతులు చేస్తున్న వేస్టు బండలు, సిమెంట్, ఇసుక హాస్టల్ గదులు ముందే ఉందని ఆ బండలు ఆ మెటీరియల్ పిల్లలకు తట్టుకొని క్రిందపడే ప్రమాదం ఉందని ఆయన అన్నారు. విద్యార్థులు ఆదోని, పత్తికొండ, ఎమ్మిగనూరు, కర్నూలు వివిధ ప్రాంతాల నుంచి వస్తే బాగా చూసుకోవాల్సిన వార్డెన్ నిర్లక్ష్యం వహిస్తే, పిల్లలు ఎవరికి చెప్పుకోవాలని ఆయన అన్నారు. తనిఖీ చేసే సమయంలో హాస్టల్ వార్డెన్ అందుబాటులో లేడని ఆయన అన్నారు. రూములకు బండ పరుపు కోసం సుమారు 6,90,000/- రూపాయలు ప్రభుత్వం కేటాయిస్తే నాసిరకం బండలు, నాసిరకం సిమెంటు వేసి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న మరియు హాస్టల్లో సరిగ్గా సమయానికి భోజనం పెట్టకుండా, వార్డెన్ లేకపోయినా ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదొ సమాధానం చెప్పాలని, కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ పై, హాస్టల్ వార్డెన్ పై, కాంట్రాక్టర్ పై నంద్యాలలో రేపు జరిగే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక(గ్రీవెన్స్)లో కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తానని ఆయన హెచ్చరించారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: