ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : మండల కేంద్రమైన పాములపాడులో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే 195వ జయంతిని ఘనంగా నిర్వహించారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా కార్యదర్శి ఆర్ఎస్ఆర్. గోపాల్, ఉపాధ్యాయులతో, ప్రజా సంఘాల నాయకులతో కలిసి సావిత్రిబాయి పూలే విగ్రహానికి పూలమాలలు వేసి, ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా కార్యదర్శి- ఆర్ఎస్ఆర్.గోపాల్, మండల అధ్యక్షుడు రాయపాటి మురళీమోహన్ లు మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి, మహిళలు విద్యను అభ్యసించేలా ఎనలేని కృషిచేసిన గొప్ప మహిళ సావిత్రిబాయి పూలే అని అన్నారు. ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం నియోజకవర్గం ప్రధాన కార్యదర్శి నాగ లింగమయ్య, జాతీయ బీసీ సంక్షేమ సంఘం మండల అధ్యక్షులు రాయపాటి. మురళీమోహన్, ఉపాధ్యక్షులు జాలా. రామ్మోహన్, హేమ చంద్ర, బాలస్వామి, వెంకటేశ్వర్లు, గోపాలకృష్ణయ్య, చంద్ర రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News