ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : పెంచిన పెట్రోల్, డీజిల్, రైతుల ఎరువుల ధరలు వెంటనే తగ్గించాలని, ఖరీఫ్ సీజన్‌లో వ్యవసాయానికి అవసరమైన డి ఏపి యూరియా కాంప్లెక్స్ రకాల ఎరువులను కొరత లేకుండా సరఫరా చేయాలని, ఎరువుల బ్లాక్ మార్కెట్‌ను అరికట్టాలని సిపిఎం పార్టీ మండల కార్యదర్శి డి.స్వామన్న, రైతు సంఘం జిల్లా నాయకులు కోట్ల నాగేశ్వర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఎస్.షేక్షాఅలీ, సిఐటియు మండల కార్యదర్శి మేకల రాజు, సోషల్ వర్కర్ కలబండి.నాగరాజు, తదితర ప్రజాసంఘాల నాయకులు బస్టాండ్ లోని అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసన తెలిపి, డిమాండ్ చేశారు. ఈ సందర్భముగా వారు మాట్లాడుతూ యుద్దం సాకు చూపి ఎరువుల కంపెనీలు ఎరువుల ధరలు పెంచి అన్నదాతల నడ్డి విరుస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇరాన్- అమెరికా ఇజ్రాయిల్ ల యుద్దం ప్రభావంతో ఉత్పత్తి ఖర్చులు పెరిగితే కేంద్ర ప్రభుత్వం ఎరువులపై సబ్సిడీ ఇవ్వాలి తప్ప ధరలు పెంచడానికి అనుమతినివ్వడం రైతులను నిలువునా ముంచడమే తప్ప ఇంకొకటి కాదన్నారు. ఇప్పటికే పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పెట్టుబడి పెట్టలేక అప్పులపాలవుతున్నా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చీమకుట్టినైన స్పర్శ లేదని విమర్శించారు ప్రభుత్వ సహకార ప్రవేట్ రంగాలలోని కంపెనీలు ఎరువుల ధరలు పెంచకుండా కేంద్రం చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ ఆయిల్ కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను లీటరుకు మూడు రూపాయలపైన పెంచాయని, మరోసారి దశల వారి పది రూపాయల వరకు పెట్రోల్, డీజిల్ ధరలు పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభం అవుతున్న ఈ సీజన్లో ఇప్పుడు ఎరువుల ధరలు పెరగడం వల్ల రైతును వ్యవసాయం నుండి బేధఖల్ చేయడమే అని అన్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభం అవుతుండగానే ఎరువుల ధరలు పెంచడం రైతాంగానికి మోయలేని భారమవుతుందన్నారు. ఒక్కో బస్తాకు రూ.125 నుండి 300లు పెంపుదల వలన రాష్ట్ర రైతాంగంపై రూ.800 కోట్ల భారం పడనున్నదని విచారం వ్యక్తం చేశారు. ఎరువుల దుకాణాల వ్యాపారులు ఇష్టారాజ్యంగా ఎరువుల ధరలు పెంచకుండా, బ్లాక్ మార్కెట్‌కు తరలించకుండా రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అవసరమైతే ఎరువుల సబ్సిడీని పెంచి, ఎరువుల ధరలు పెరగకుండా చూడాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో షేక్షావలి, మేకల రాజు, బాల యేసు చెన్నయ్య, సోషల్ వర్కర్ నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News