ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా గ్రామాల్లో బిజెపి బలోపేతం చేస్తామని మండల అధ్యక్షులు రాయపాటి మురళీమోహన్ తెలిపారు. కేంద్ర, రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు, నంద్యాల జిల్లా అధ్యక్షుడు డాక్టర్ అభిరుచి మధు సూచనల మేరకు శనివారం మండల కేంద్రంలోని, బిజెపి కార్యాలయంలో మండల పదాధికారుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బిజెపి మండల అధ్యక్షుడు రాయపాటి మురళీమోహన్ మాట్లాడుతూ ప్రతి గ్రామంలో భారతీయ జనతా పార్టీని బలోపేతం చేసి, బిజెపి జెండాను రెపరెపలాడేలా కృషి చేస్తామని తెలిపారు. కేంద్ర సంక్షేమ పథకాలు ప్రజలకు వివరించాలని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి స్థానంలో బిజెపి అభ్యర్థి పోటీ చేసేలా ఇప్పటి నుంచే కార్యాచరణ రూపొందించుకోవాలని నాయకులకు సూచించారు. ముఖ్యంగా పార్టీపై ఆసక్తి ఉన్న యువతను బిజెపి లోకి తీసుకురావాలని, స్థానిక సంస్థల ఎన్నికలకు ఇప్పటి నుంచే సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. బిజెపి కార్యకర్తలకు పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని తెలిపారు. మండల పదాధికారులు ప్రజలతో నిరంతరం మమేకమై, గ్రామాల్లోని ప్రజా సమస్యలను గుర్తించి వాటిని పార్టీ నాయకుల ద్వారా సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. ప్రజా సమస్యల పరిష్కారంతో పాటు పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లి, ప్రతి గ్రామంలో బిజెపికి బలమైన కార్యకర్తల బృందాన్ని ఏర్పాటు చేయాలని నాయకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మండల పదాధికారులు ప్రవీణ్ కుమార్, గోపాలకృష్ణయ్య, రామాంజనేయులు, వెంకటేశ్వర్లు, మల్లికార్జున, మంగలి వెంకటేశ్వర్లు, ఇమ్రాన్ భాష, ఎస్.కె.ఖాజా వలి, ఆంజనేయులు, తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News