ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : పాములపాడు మండలంలోని, శాంతినిలయం గ్రామంలో ఉన్న శ్రీ సుంకుల పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో నిర్వహించిన 41వ రోజు ఉత్సవ కార్యక్రమానికి బీజేపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు అభిరుచి మధు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ చేసిన దేశ సేవల గురించి స్మరించుకున్నారు. అనంతరం అభిరుచి మధు మాట్లాడుతూ దేశ సమైక్యత కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పాములపాడు మండల అధ్యక్షులు రాయపాటి మురళీమోహన్, బీజేపీ సీనియర్ నాయకులు, బీఎల్ఏ-1 నందికొట్కూరు అసెంబ్లీ కన్వీనర్ చల్లా దామోదర్ రెడ్డి, మండల ఉపాధ్యక్షులు శంకర్ గౌడ్, కిసాన్ మోర్చా నాయకులు సాంబశివరావు, ప్రధాన కార్యదర్శి గోపాలకృష్ణయ్య, జిల్లా ఉపాధ్యక్షులు రవికుమార్, బాలముని, పార్టీ కార్యకర్తలు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
Admin
E Nivas News