ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / ఆత్మకూరు : ఆత్మకూరు మండలంలోని, బాపనంతాపురం గ్రామం నందు నూతనంగా ఏర్పాటు చేసిన ఆత్మకూరు డివిజనల్ అభివృద్ధి అధికారి (డిడిఓ) కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి ప్రారంభించారు. కూటమి ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా నూతనంగా ప్రారంభిస్తున్న 77 డివిజనల్ అభివృద్ధి అధికారి కార్యాలయాల నిర్మాణాలలో భాగంగా ఈరోజు ఆత్మకూరు మండలంలోని, బాపనంతాపురం గ్రామంలో శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి డిడిఓ కార్యాలయాన్ని ప్రభుత్వ అధికారులతో, నాయకులతో కలిసి ఘనంగా ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో తహసిల్దార్- జి.రత్నరాధిక, వ్యవసాయ అధికారిణి హేమలత, డివిజనల్ అధికారులు, అన్ని శాఖల అధికారులు, టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Admin
E Nivas News