ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / వెలుగోడు : వెలుగోడు మండలంలోని, వేల్పనూరు నందు శ్రీశైలం నియోజకవర్గంనకు చెందిన 48 మంది లబ్ధిదారులకు మంజూరైన రూ.51,06,083/- ల విలువ గల చెక్కులను శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా.రాజశేఖర రెడ్డి పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ వైద్యం పరంగా ఆపదలో ఉన్నవారికి సకాలంలో చికిత్స కోసం అందిస్తున్న నిధులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. పార్టీలకు అతీతంగా కేవలం అర్హతే ఆధారంగా సీఎం రిలీఫ్ ఫండ్ నిధులు మంజూరు చేస్తున్నాం ఆని ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, నియోజవర్గం లబ్ధిదారులు పాల్గొనడం జరిగింది.
Admin
E Nivas News