Friday, 11 September 2026 11:14:03 PM
# ఓటర్ల ధ్రువపత్రాల పరిశీలన వేగవంతంగా చేయాలి.. కలెక్టర్ కుమార్ దీపక్ # ఘనంగా పోలాల అమావాస్య’ వేడుకలు.. ఎద్దులను అందంగా అలంకరించి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు.. # పాఠశాలల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలి.. కలెక్టర్ యువరాజ్ మర్మత్.. # ఆత్మహత్యల నివారణ దినం పోస్టర్ ఆవిష్కరణలో జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి.గితే.. # పోలీస్–అటవీ శాఖల మధ్య మరింత సమన్వయంతో అటవీ సంపద, వన్యప్రాణుల రక్షణకు చర్యలు తీసుకుంటాం... ఎస్పి అశోక్ కుమార్.. # హియరింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలి... కలెక్టర్ కుమార్ దీపక్ # చిట్యాల ఐలమ్మ పోరాట స్ఫూర్తిని నేటి యువతరం ఆదర్శంగా తీసుకొని సమాజంలో ఆర్థిక అసమానతల నిర్మూలనకై కృషి చేయాలి # ఆత్మకూరులో ఉద్యోగ సంఘాల నాయకులకు ఘనంగా సన్మానం చేసిన జేఏసీ # రానున్న కాలంలో జర్నలిస్టుల ఐక్యతతో హక్కుల సాధనకు ముందుకు వెళ్తాం... ఏపీఎంఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షులు డిల్లీబాబు రెడ్డి # ఆశా వర్కర్ల అక్రమ అరెస్టులు ఖండిస్తూ సీఐటీయు ఆధ్వర్యంలో రోడ్డు పై రాస్తారోకో..! అసెంబ్లీ సమావేశాల్లో ఆశాలకు 18వేలు ఫిక్స్ డ్ వేతనం నిర్ణయించాలి # పాత పెన్షన్ విధానం పునరుద్ధరించి బకాయిలు చెల్లించాలని నేడు ఎల్బీ స్టేడియంలో మహా ధర్నా... # మాజీ సీఎం కేసీఆర్‌పై చేసిన వ్యాఖ్యలతో తీవ్ర దుమారం... # కవితపై అనుచిత కామెంట్స్ చేసిన కానిస్టేబుల్‌పై నాన్‌బెయిలబుల్ కేసు నమోదు... # కాంగ్రెస్‌ ఎవరి చావునూ కోరుకోదు.. # శాసనసభ నుంచి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల హరీశ్‌రావు, కేటీఆర్‌తో సహా 22 మంది సస్పెన్షన్.. # తెలంగాణ గర్వించదగ్గ మహనీయుడు కాళోజి నారాయణరావు... # స్పీకర్ గారూ.. మా సభ్యుడు మిమ్మల్ని ఉద్దేశించి అనలేదు.. మాజీ మంత్రిహరీశ్ రావు... # పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు... 16 మంది పంచాయతీ కార్యదర్శులకు షోకాజ్ నోటీసులు... # ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై క్రిమినల్ కేసు పెట్టాలి... # స్పీకర్‌ కంటతడి దృశ్యాలపై ప్రసాద్‌కు సీఎం, డిప్యూటీ సీఎం పరామర్శ...

ఆత్మకూరులో ఉద్రిక్తత- శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి నిరసన ర్యాలీని అడ్డుకున్న పోలీసులు

Date : 10 August 2026 07:50 PM Views : 104

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / ఆత్మకూరు : ఆత్మకూరు పట్టణంలో నిర్వహించిన నిరసన ర్యాలీలో రాష్ట్రంలో జరిగిన డీఎస్సీ-2025 స్కామ్‌పై సీబీఐ విచారణ చేపట్టాలని, నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని కోరుతూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యాప్త నిరసనలకు పిలుపు ఇవ్వడం జరిగింది. అలాగే విద్యా దీవెన, వసతి దీవెన బకాయిలను తక్షణమే చెల్లించాలని, నిరుద్యోగ భృతిని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ, ఈ పిలుపులో భాగంగా శ్రీశైలం నియోజకవర్గం, ఆత్మకూరు పట్టణంలో భారీ నిరసన ర్యాలీని నిర్వహించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా శ్రీశైలం నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు శిల్పా చక్రపాణి రెడ్డి ఈరోజు తన నివాసం నుంచి బయలుదేరి, నంద్యాల టర్నింగ్ వద్ద ఉన్న దివంగత మహానేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి, ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం నాయకులు, కార్యకర్తలతో కలిసి ర్యాలీగా ముందుకు సాగుతుండగా ముందస్తు అనుమతులు లేవని పేర్కొంటూ పోలీసులు వారిని మార్గమధ్యంలోనే అడ్డుకున్నారు. పోలీసుల తీరుకు తీవ్ర నిరసనగా శిల్పా చక్రపాణి రెడ్డి తన అనుచరులతో కలిసి, అక్కడే రోడ్డుపై బైఠాయించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి మాట్లాడుతూ శాంతియుతంగా నిరసన తెలుపుతున్న మమ్మల్ని పోలీసులు అక్రమంగా అడ్డుకోవడం ప్రజాస్వామ్య విరుద్ధం అని అన్నారు. డీఎస్సీ అవకతవకలపై వెంటనే సీబీఐ విచారణ జరిపించాలనీ, మంత్రి నారా లోకేష్ తన పదవికి తక్షణమే రాజీనామా చేయాలని తీవ్ర స్థాయిలో డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి శ్రీశైలం నియోజకవర్గ సీనియర్ నాయకులు శిల్పా భువనేశ్వర్ రెడ్డి, వైయస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షుడు సయ్యద్ మీర్, మాజీ అధ్యక్షుడు అంజాద్ అలీ, మోమిన్ మునీర్ భాష, మోమిన్ ముస్తఫా, తదితర నాయకులు, యువకులు, నిరుద్యోగులు నియోజకవర్గంలోని అన్ని మండలాల నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :