Wednesday, 29 July 2026 02:34:24 AM
# కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి

నందికొట్కూరు నియోజవర్గం మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి చేతుల మీదుగా పాములపాడు ఓపెన్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం

Date : 10 January 2026 11:39 PM Views : 236

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : పాములపాడులోనీ, జిల్లా పరిషత్ హైస్కూల్ మైదానంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని శనివారం గ్రామ ప్రజల సహకారంతో గ్రామ యూత్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఓపెన్ క్రికెట్ టోర్నమెంట్ మొదటి రోజు కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా నందికొట్కూరు నియోజవర్గం మాజీ శాసనసభ్యులు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి, మాజీ జడ్పిటిసి తరిగోపుల నాగేశ్వరావు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కురువ.ఎల్లయ్య, ఎస్సై- పి.తిరుపాలు హాజరయ్యారు. మొదటి బహుమతికి స్పాన్సర్లుగా జిల్లా బిఎస్ఎన్ఎల్ అడ్వైజరీ కమిటీ మెంబర్ & తెలుగుదేశం పార్టీ యువ నాయకులు కురువ రమేష్, శ్రీ వివేకానంద విద్యా విహార్ హైస్కూల్ కరస్పాండెంట్ ఆర్.ఎస్.ఆర్.గోపాల్, మమతా క్లినిక్ డాక్టర్ ఎం.రాజు పాల్గొన్నారు. రెండో బహుమతికి స్పాన్సర్లుగా ఎస్విఎల్ రంజిత్, వెంకటేశ్వర ఫర్టిలైజర్స్ కురువ నాగరాజు, మూడో బహుమతికి స్పాన్సర్లుగా టైలర్ లింగారెడ్డి, డిష్ రామచంద్ర వ్యవహరించారు. ఈ సందర్భంగా నందికొట్కూరు మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి బ్రాహ్మణకోట్కూరు వర్సెస్ లింగాల మధ్య జరిగిన ఇనాగ్రేషన్ మ్యాచ్‌కు రిబ్బన్ కటింగ్ చేసి, క్రీడాకారులను పరిచయం చేసుకుని టాస్ వేసి, క్రికెట్ పోటీలను అధికారికంగా ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కురువ వెంకటేశ్వర్లు, మిట్టకందాల గ్రామ సర్పంచ్ చింతల నారాయణ, వీరారెడ్డి, వెంకటస్వామి, తిమ్మయ్య, బాలస్వామి, యోహాన్, లోకేశ్వర్ రెడ్డి, ఈశ్వర్ రెడ్డి, బాలీశ్వర్ రెడ్డి, ప్రతాపరెడ్డి, రామ సుబ్బయ్య, పి.హుసేన్ భాష, రిటైర్డ్ గవర్నమెంట్ టీచర్ జాల కృష్ణుడు, చెలిమిళ్ళ డేగల.లోకేశ్వరుడు, తదితరులు పాల్గొన్నారు. అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, క్రీడాకారులు, క్రీడాభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని, మొదటి రోజు కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :