Friday, 11 September 2026 10:18:33 PM
# ఓటర్ల ధ్రువపత్రాల పరిశీలన వేగవంతంగా చేయాలి.. కలెక్టర్ కుమార్ దీపక్ # ఘనంగా పోలాల అమావాస్య’ వేడుకలు.. ఎద్దులను అందంగా అలంకరించి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు.. # పాఠశాలల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలి.. కలెక్టర్ యువరాజ్ మర్మత్.. # ఆత్మహత్యల నివారణ దినం పోస్టర్ ఆవిష్కరణలో జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి.గితే.. # పోలీస్–అటవీ శాఖల మధ్య మరింత సమన్వయంతో అటవీ సంపద, వన్యప్రాణుల రక్షణకు చర్యలు తీసుకుంటాం... ఎస్పి అశోక్ కుమార్.. # హియరింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలి... కలెక్టర్ కుమార్ దీపక్ # చిట్యాల ఐలమ్మ పోరాట స్ఫూర్తిని నేటి యువతరం ఆదర్శంగా తీసుకొని సమాజంలో ఆర్థిక అసమానతల నిర్మూలనకై కృషి చేయాలి # ఆత్మకూరులో ఉద్యోగ సంఘాల నాయకులకు ఘనంగా సన్మానం చేసిన జేఏసీ # రానున్న కాలంలో జర్నలిస్టుల ఐక్యతతో హక్కుల సాధనకు ముందుకు వెళ్తాం... ఏపీఎంఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షులు డిల్లీబాబు రెడ్డి # ఆశా వర్కర్ల అక్రమ అరెస్టులు ఖండిస్తూ సీఐటీయు ఆధ్వర్యంలో రోడ్డు పై రాస్తారోకో..! అసెంబ్లీ సమావేశాల్లో ఆశాలకు 18వేలు ఫిక్స్ డ్ వేతనం నిర్ణయించాలి # పాత పెన్షన్ విధానం పునరుద్ధరించి బకాయిలు చెల్లించాలని నేడు ఎల్బీ స్టేడియంలో మహా ధర్నా... # మాజీ సీఎం కేసీఆర్‌పై చేసిన వ్యాఖ్యలతో తీవ్ర దుమారం... # కవితపై అనుచిత కామెంట్స్ చేసిన కానిస్టేబుల్‌పై నాన్‌బెయిలబుల్ కేసు నమోదు... # కాంగ్రెస్‌ ఎవరి చావునూ కోరుకోదు.. # శాసనసభ నుంచి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల హరీశ్‌రావు, కేటీఆర్‌తో సహా 22 మంది సస్పెన్షన్.. # తెలంగాణ గర్వించదగ్గ మహనీయుడు కాళోజి నారాయణరావు... # స్పీకర్ గారూ.. మా సభ్యుడు మిమ్మల్ని ఉద్దేశించి అనలేదు.. మాజీ మంత్రిహరీశ్ రావు... # పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు... 16 మంది పంచాయతీ కార్యదర్శులకు షోకాజ్ నోటీసులు... # ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై క్రిమినల్ కేసు పెట్టాలి... # స్పీకర్‌ కంటతడి దృశ్యాలపై ప్రసాద్‌కు సీఎం, డిప్యూటీ సీఎం పరామర్శ...

ప్రతి గ్రామంలో "బిజెపి"ని బలోపేతం చేస్తాం

బిజెపి మండల అధ్యక్షులు రాయపాటి మురళీమోహన్

Date : 04 August 2026 10:36 PM Views : 75

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : పాములపాడు మండలంలోని, ప్రతి గ్రామంలో బీజేపీ జెండాను ఎగరవేసి, ప్రతి గ్రామంలో భారతీయ జనతా పార్టీని బలోపేతం చేస్తామని మండల అధ్యక్షులు రాయపాటి మురళీమోహన్ తెలిపారు. బిజెపి కేంద్ర, రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు, బిజెపి నంద్యాల జిల్లా అధ్యక్షులు డాక్టర్ అభిరుచి మధు సూచనల మేరకు మండల కేంద్రమైన పాములపాడు లో బిజెపి కార్యాలయంలో మండల పదాధికారుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా నందికొట్కూరు అసెంబ్లీ ఇన్చార్జి, సీనియర్ నాయకులు చల్లా దామోదర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సమావేశంలో మండలంలో బిజెపిని బలోపేతం చేస్తూ, స్థానిక సంస్థల ఎన్నికలలో ఆసక్తి ఉన్న యువతను బీజేపీ పార్టీలోకి తీసుకుని రావడానికి ప్రతి ఒక్కరూ కృషిచేయాలని తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు రాయపాటి మురళీమోహన్ మాట్లాడుతూ "సర్" ప్రోగ్రాం లో మనం క్రియాశీలకంగా పాల్గొనాలని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు బిజెపి కేంద్ర, రాష్ట్ర పిలుపుమేరకు ఇప్పటి నుంచే సర్వం సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. మండలంలోని, బిజెపి కార్యకర్తలకు అన్ని విషయాల్లో పార్టీ అండగా ఉంటుందని, పార్టీ కార్యకర్తల వికాసం కోసం బిజెపి ఎప్పుడూ కృషి చేస్తుందని అన్నారు. మండల పదాధికారులు ప్రజలతో మమేకమై పార్టీ పటిష్టతకు కృషి చేయాలని, మండలంలోని, ప్రజా సమస్యలు, సమీప గ్రామాలలోని సమస్యలు పార్టీ, అధికారుల దృష్టికి తీసుకువెళుతూ పరిష్కార మార్గం కోసం కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పదాధికారులు ప్రవీణ్ కుమార్, గోపాలకృష్ణయ్య, రమేష్ ఆచారి, వెంకటేశ్వర్లు, మల్లికార్జున,వెంకటరమణ, చంద్ర శేఖర్ రెడ్డి, సూర్యం, ఆరోగ్య స్వామి, అబ్రహం, లాజరేష్, ఏసన్న, చిలుక రాజు, మహేష్, నాగేష్, రాజు తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: