Tuesday, 28 July 2026 11:15:30 PM
# ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి # టెలికామ్ వినియోగదారులకు మెరుగైన సేవలే ట్రాయ్ లక్ష్యం

సీబీజీ ప్లాంటును ప‌రిశీలించిన ఎన్టీఆర్ జిల్లా క‌లెక్ట‌ర్ డాక్టర్ జి.ల‌క్ష్మీశ‌

Date : 18 February 2026 11:10 PM Views : 175

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / ఎన్టీఆర్ జిల్లా : కంచిక‌చ‌ర్ల మండ‌లం, ప‌రిటాలలో ఏర్పాటుచేస్తున్న రిల‌య‌న్స్ న్యూ ఎనర్జీ - కంప్రెస్డ్ బ‌యోగ్యాస్ (సీబీజీ) ప్లాంటును ఎన్‌టీఆర్ జిల్లా క‌లెక్ట‌ర్ డాక్టర్ జి.ల‌క్ష్మీశ బుధ‌వారం సంద‌ర్శించారు. 30 ఎక‌రాల విస్తీర్ణంలోని ఈ ప్లాంటును త్వ‌ర‌లో గౌర‌వ ముఖ్య‌మంత్రి ప్రారంభించే అవ‌కాశ‌మున్నందున ప్లాంటులో జ‌రుగుతున్న ప‌నుల‌ను ప‌రిశీలించారు. రోజుకు 22 ట‌న్నుల సీబీజీ ఉత్ప‌త్తి ల‌క్ష్యంగా ప్లాంటును సిద్ధం చేస్తున్న‌ట్లు ప్లాంటు సిబ్బంది వివ‌రించారు. స్థానిక వ్య‌వ‌సాయ వ్య‌ర్థాలు, మునిసిప‌ల్ ఘ‌న వ్య‌ర్థాలు వంటి వాటిని ఉప‌యోగించి ప‌ర్యావ‌ర‌ణ హిత ఇంధ‌నాన్ని ఉత్ప‌త్తి చేసేందుకు ఇలాంటి ప్లాంటులు దోహ‌దం చేస్తాయ‌న్నారు. ఉపాధి అవ‌కాశాల‌ను విస్తృతం చేసేందుకు, రైతుల ఆదాయాన్ని పెంచేందుకు కూడా చేయూత‌నిస్తాయ‌న్నారు. క‌ర్బ‌న ఉద్గారాల‌కు క‌ళ్లెం వేయ‌డంతో పాటు రాష్ట్రాన్ని క్లీన్ ఎన‌ర్జీ హ‌బ్‌గా తీర్చిదిద్దే లక్ష్యంతో రాష్ట్ర ప్ర‌భుత్వం సీబీజీ ప్లాంట్ల‌ను పెద్దఎత్తున ప్రోత్స‌హిస్తోందన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో నందిగామ ఆర్‌డీవో కె.బాల‌కృష్ణ‌, సంస్థ డీజీఎం శ్రీకాంత్‌, మేనేజ‌ర్ శ్రీచ‌ర‌ణ్‌, అసిస్టెంట్ మేనేజ‌ర్ చిట్టిబాబు ఉన్నారు. ఈ సమాచారం డీఐపీఆర్‌వో, ఐ అండ్ పీఆర్‌, ఎన్‌టీఆర్ జిల్లా వారి ద్వారా జారీ చేయడం జరిగింది.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: