ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ అన్న ఆదేశాల మేరకు నంద్యాల జిల్లా ఇన్చార్జి పులికుంట్ల.గోపి మాదిగ అన్న సలహా మేరకు పాములపాడు మండల కేంద్రంలో ఘనంగా ఆరోగ్యశ్రీ సాధన దినోత్సవ వేడుక ఎమ్మార్పీఎస్ మరియు ప్రజాసంఘాల ఆధ్వర్యంలో భారీ కేక్ ను కటింగ్ చేసి ఒకరికి ఒకరు తినిపించుకొని సంతోషంగా శుభాకాంక్షలు తెలుపుతూ ఘనంగా నిర్వహించడం జరిగింది. మండల కేంద్రమైన పాములపాడులోని, ఉమ్మడి కర్నూలు జిల్లా ప్రెస్ క్లబ్ లో ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు ప్రేమ రాజు & ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఆరోగ్యశ్రీ సాధన దినోత్సవం పాములపాడు మండల ఎంఆర్పిఎస్ అధ్యక్షులు రాంప్రసాద్ మాదిగ, ఎంఎస్పి ఉపాధ్యక్షులు సురేష్ మాదిగ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి పాములపాడు మండల ఇన్చార్జ్ ప్రేమ్ రాజు మాదిగ మరియు రాష్ట్ర వడ్డెర కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ వి.రామసుబ్బయ్య మైనార్టీ నాయకులు & సేవా భారతి రూరల్ డెవలప్మెంట్ సొసైటీ అధ్యక్షులు ఎస్.షర్ఫద్దీన్ అలీ, మాల మహానాడు జిల్లా నాయకులు అంకన్న, రజక సంఘం. నాయకులు వెంకటశివుడు, టిడిపి కల్చరల్ మండల అధ్యక్షుడు భావన వినోద్ కుమార్, తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొని, పద్మశ్రీ మందకృష్ణ మాదిగ అన్న ఉద్యమ చరిత్రను గుర్తు చేసుకుంటూ ఆరోగ్యశ్రీ పథకం రావడానికి ఎంతో శ్రమతో కూడిన ఉద్యమాలు చేపట్టినందుని ఈ ఆరోగ్య శ్రీ పథకం ఏర్పడిందని అన్నారు. ఈ పథకాన్ని, సమాజంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అణగారిన వర్గాలవారందికి కార్పొరేట్ వైద్యం అందేలాగా పోరాటం సాగించిన ఘనత ఒక మందకృష్ణ మాదిగకె. దక్కుతుందనీ అన్నారు. అదేవిధంగా సమాజంలో, వారి ఇంట్లో కూడా అణచివేతకు, అవమానాలకు. గురవుతున్న వికలాంగుల సమస్యల పట్ల సోదర భావంతో ఉద్యమాలు నడిపిన చరిత్ర, వారికి పెన్షన్లు పెంచే. విధంగా పోరాటం చేసిన చరిత్రకూడా మందకృష్ణ మాదిగకె దక్కుతుందని అన్నారు. మందకృష్ణ మాదిగ అంటే ఒక వ్యక్తి కాదు ఇది సమాజ సేవకు ఉపయోగపడే శక్తి అని ప్రజాసంఘాల నాయకులు కొనియాడారు. మంద కృష్ణ మాదిగన్న ఆధ్వర్యంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల రాజ్యాధికారం కోసం ఏకమై పోరాటం చేద్దామని వక్తలు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వేంపెంట కడతల.స్వామన్న, శ్రీనివాసులు, రవికుమార్, సోమేశ్వర్, జి.సాయి కృష్ణ, మంగలి.ప్రసాదు మరియు ఇతర ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు.
Admin
E Nivas News