Tuesday, 28 July 2026 10:22:42 PM
# చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి # టెలికామ్ వినియోగదారులకు మెరుగైన సేవలే ట్రాయ్ లక్ష్యం # భక్తిశ్రద్ధలతో బోనాల వేడుకలు..

రాజముద్రతో కూడిన కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేసన గౌరు చరితరెడ్డి

Date : 08 February 2026 08:04 AM Views : 204

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / ఓర్వకల్ : పాణ్యo నియోజకవర్గం, ఓర్వకల్లు మండలంలోని, ఉప్పలపాడు గ్రామంలో ఓ.హెచ్.ఎస్.ఆర్ వాటర్ ట్యాంక్ ప్రారంభోత్సవం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాణ్యం ఎమ్మెల్యే, టిడిపి నంద్యాల జిల్లా అధ్యక్షురాలు గౌరు. చరతరెడ్డితో పాటు అతిధిగా ఏపీ.ఈ. డబ్ల్యూ.డి.సి రాష్ట్ర డైరెక్టర్.జి.నాగముని ప్రారంభించడం జరిగింది. అనంతరం రీ-సర్వే పూర్తిచేసి ప్రభుత్వం నూతనంగా జారీ చేసిన రైతులకు కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను గ్రామ సచివాలయం వద్ద రెవెన్యూ అధికారులతో కలిసి టీ.డీ.పీ నంద్యాల జిల్లా అధ్యక్షురాలు, పాణ్యo నియోజకవర్గం ఎమ్మెల్యే గౌరు.చరిత రెడ్డితో పాటు ఏపీ.ఈ.డబ్ల్యు.ఐ.డీ.సీ రాష్ట్ర డైరెక్టర్, జి.నాగమునిల చేతుల మీదుగా రైతులకు రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకము పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ రైతుల భూమి హక్కులకు భద్రత కల్పించడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతుల కోసం అనేకమైన సంక్షేమ పథకాలు తీసుకొస్తున్నారని వాటిని రైతులు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. అంతేకాకుండా భూ సంబంధిత వివాదాలు, లోపాలు రైతులను సంవత్సరాల పాటు ఇబ్బంది పెట్టిన పరిస్థితిని మార్చేందుకే ప్రభుత్వం రీ-సర్వే చేపట్టిందని తెలిపారు. పూర్తి పారదర్శకతతో, రాజముద్రతో కూడిన కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు అందించడం ద్వారా రైతులకు శాశ్వత భరోసా కల్పిస్తున్నామని స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో తీసుకోవచ్చిన ల్యాండ్ టైటిల్ యాక్టును రద్దుచేసి రైతుల కోసం నూతనంగా ఈ పథకం తీసుకొచ్చామని అన్నారు. రైతులు ఎలాంటి ఆందోళన లేకుండా తమ భూమి హక్కులను వినియోగించుకునేలా ప్రభుత్వం అన్నిచర్యలు తీసుకుంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు, మండల అధికారులు, సచివాలయం ఉద్యోగులు, కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :