ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : పాములపాడు మండలంలోని, వేంపెంట గ్రామానికి చెందిన సింగపూర్ తెలుగు సమాజం ఉపాధ్యక్షుడు డాక్టర్ టేకూరి.నాగేశ్వరావు, ఆయన సతీమణి టేకూరి.రేణుక, కుమారులు టేకూరి.కుందన్, టేకూరి.యువ, గ్రామ మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ లు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు, కేంద్ర,రాష్ట్ర మంత్రులకు, ఎమ్మెల్యే లకు, ఎంపీలకు, నాయకులకు, భారతదేశ ప్రజలందరికీ, ప్రతి ఒక్కరికి భోగి, సంక్రాంతి, కనుమ పండుగల శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా అంతర్జాతీయ సమాజ సేవకుడు & వరల్డ్ హ్యూమన్ రైట్స్ అవార్డు గ్రహీత డాక్టర్ టేకూరి.నాగేశ్వరావు మాట్లాడుతూ భోగి పండుగ రేగి పండ్లను పిల్లలపై పోస్తూ భోగిపండ్ల పండుగ చేసుకుంటూ భోగభాగ్యాలతో తులతూగాలని సంక్రాంతి ఉత్సవాలలో గంగిరెద్దుల కోలాహలంతో, రంగవల్లుల హరివిల్లులతో, పాల పొంగళ్లతో, హరిదాసుల కీర్తనలతో సరదాగా సంక్రాంతి జరుపుకుంటూన్నాం అన్నారు. కనుమ పండుగతో ఏడాది పొడవునా మన కష్టంలో పాలుపంచుకునే పశు సంపదను పూజిస్తూ కమ్మని అనుభూతితో కనుమ పండగ జరుపుకోవాలని అన్నారు. మీరు, మీ కుటుంబ సభ్యులు సుఖ సంతోషాలతో, అష్టైశ్వర్యాలతో, ఆయురారోగ్యాలతో తులతూగాలని ఆ భగవంతున్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. భోగి మంటల భోగ భాగ్యాలు ఈ విధంగా ఉంటాయన్నారు. రంగు రంగుల రంగవల్లులు, కనుల విందుగా గొబ్బెమ్మలు, హరిదాసుల భజన కీర్తనలు, కర కరలాడే చకినాల్ గారెలు, ఘుమ ఘుమలాడే పొగలు గక్కె పొంగళ్లు, పట్టు చీరెలు, పావడాలు, పరికిణీలు, పీ పీ మంటూ సన్నాయిలు, గంగిరెద్దులు గంట సవాళ్లు, డూ డూ డూ డూ బసవన్నలు, ఆకాశంలో రెప రెపలాడే పతంగులు, తియ్యగ తిని తియ్యగా మాట్లాడాలని అన్నారు.
నువ్వులు శక్కరి దిని నూరేళ్లు బతుకు అంటూ మన పెద్ద మనుషుల చల్లని దీవెనెలు పిల్లల నోము, కొత్త కోడలు నోము అందరికీ ఉంటాయన్నారు. ఈ పండుగకు క్రికెట్ టోర్నమెంట్లు, కబడ్డీ, ఇతర ఆటల పోటీలు, కోడి పందేలు , పొట్టేళ్ల పోటీలు, ఎద్దుల పందాలు, కొలువుదీరిన బొమ్మల కొలువులు ఉంటాయన్నారు. వృషభ రాజముల పూజల కనుమ సంతోషాల సంక్రాంతి. తెచ్చెను ముదమున కొత్త క్రాంతి విరజిల్లాలని ఆ దేవుని ప్రార్థిస్తూ, మీకూ, మీ కుటుంబ సభ్యులకు, మన భారత దేశ ప్రజలందరికీ పేరుపేరునా భోగి, సంక్రాంతి మరియు కనుమ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నామన్నారు.
Admin
E Nivas News