Sunday, 13 September 2026 01:34:08 AM
# నీటి సంఘం అధ్యక్షులు తిమ్మారెడ్డి కృషితో మద్దూరు కుంటకు కేసీ.కెనాల్ జలాలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఆశీర్వదించండి...! ఆత్మకూరు సింగల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దిన్ # పాములపాడులో ఘనంగా కామ్రేడ్ సీతారాం ఏచూరి రెండవ వర్ధంతి # ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పి ఆర్ టి యు నంద్యాల జిల్లా శాఖ ప్రాతినిధ్యం # కార్మికుడి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు... సింగరేణి భద్రతా ప్రమాణాలపై ఎంపీ హెచ్చరిక... # ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజకు ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారానికి ఎంపిక.. # ఫ్రీ బస్సు వద్దని మహిళల రాస్తారోకో.. # ఆర్థిక ఇబ్బందులతో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు జగన్ ఆత్మహత్య... # దసరా నుంచి లబ్ధిదారులకుకొత్త పింఛన్లు పంపిణీ... # శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్.. # కోతులను పారద్రోలడానికి కొండెంగ అవతారం ఎత్తిన ఉపసర్పంచ్

గ్లోబల్ ఎన్ఆర్ఏ టిడిపి జాతీయ కమిటీ అధ్యక్షుడిగా ఎంపికైన డాక్టర్ పి.గురు రాజాకు శుభాకాంక్షలు తెలియజేసిన ఏపీ ఈడబ్ల్యూఐడిసి రాష్ట్ర డైరెక్టర్ జి.నాగముని

Date : 13 July 2026 02:56 PM Views : 117

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / కర్నూల్ : కర్నూలు పట్టణంలోని, జిల్లా బార్ అసోసియేషన్ కార్యాలయంలో ఏపీ ఈడబ్ల్యుఐడీసీ రాష్ట్ర డైరెక్టర్ జి.నాగముని ఆధ్వర్యంలో గ్లోబల్ ఎన్ఆర్ఏ టిడిపి జాతీయ కమిటీ అధ్యక్షుడిగా ఎంపికైన డాక్టర్ పి.గురు రాజా కు శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ న్యాయవాదులు రాజేష్, నారాయణ, వెంకటేష్, శేఖర్, జగన్, హుస్సేన్, పులిరాజా, ఇతర న్యాయవాదులతో, టిడిపి కార్యకర్తలతో కలిసి భారీ కేక్ ను కటింగ్ చేసి ఒకరికి ఒకరు తినిపించుకొని సంతోషంగా సంబరాలు చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా టిడిపి లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి & ఉమ్మడి కర్నూలు జిల్లా మాజీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ & ఏపీ ఈడబ్ల్యూఐడీసీ రాష్ట్ర డైరెక్టర్ జి.నాగముని మాట్లాడుతూ రాజకీయాల్లో కొందరు ప్రచారం కోసం ఆరాటపడితే, మరికొందరు ప్రజాక్షేత్రంలో కనిపించకుండానే పార్టీ గెలుపు గుర్రాలను పరుగులెత్తిస్తారు అన్నారు. ప్రచార ఆర్భాటాలకు దూరంగా ఉండి తెర వెనుక ఉండి నిశ్శబ్దంగా వ్యూహాలు రచిస్తూ, పార్టీ బలోపేతానికి నిరంతరం శ్రమించే నాయకులకు తెలుగు దేశం పార్టీలో ఎప్పుడూ సముచిత స్థానం దక్కుతుందని మరోసారి నిరూపితమైందన్నారు. రెండు దశాబ్దాలుగా ఎస్ఆర్ఎ టీడీపీ నాయకుడిగా అలుపెరుగని సేవలను అందించిన ప్రముఖ వైద్యులు, రాజకీయ వ్యూహకర్త డాక్టర్ పి.గురురాజా (డాక్టర్ రాజా)ను గ్లోబల్ ఎన్ఆర్ఎ టీడీపీ జాతీయ కమిటీ అధ్యక్షుడిగా అధినేత, సీఎం నారా చంద్రబాబు నాయుడు నియమించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. 44 మంది సభ్యులతో కూడిన ప్రతిష్టాత్మక టీడీపీ ఎన్ఆర్ఏ జాతీయ కమిటీ అధ్యక్షుడిగా డాక్టర్ గురురాజాతో పాటు, కర్నూలు నగరానికి చెందిన ఆర్గనైజింగ్ సెక్రెటరీగా షా ఫహద్ సయ్యద్ కు కూడా చోటు దక్కిందన్నారు. నంద్యాల జిల్లాకు చెందిన డాక్టర్ గురురాజా వృత్తిరీత్యా గుర్తింపు పొందిన ప్రముఖ స్త్రీ వైద్య నిపుణుడు అని అన్నారు. వైద్య వృత్తిలో భాగంగా అమెరికా వెళ్లి టెక్సాస్‌ నగరంలో స్థిరపడ్డారన్నారు. అయినా కూడా తన దేశంపై, సొంత గడ్డపై ఉన్న మమకారాన్ని, బాధ్యతను ఆయన ఎన్నడూ మరువలేదన్నారు. రాయలసీమ ప్రాంతంలోనూ, రాష్ట్రంతోనూ బలమైన సాంస్కృతిక, సామాజిక అనుబంధాన్ని కొనసాగిస్తూ వచ్చారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజన్, ఐటీ విప్లవానికి ఆకర్షితులైన డాక్టర్ పి.గురురాజా 20 ఏళ్లుగా ఎన్ఆర్ఏ టీడీపీలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. అంతర్జాతీయంగా ప్రవాసంధ్రులు, పార్టీ అధిష్ఠానానికి మధ్య ఒక బలమైన వారధిగా నిలిచారన్నారు. ఆయన పార్టీ విధేయతను గుర్తించిన టీడీపీ నాయకులు గుర్తించారు. 2024 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం విజయం కోసం తెర వెనుక పని చేసిన ఎందరో నాయకుల్లో డాక్టర్ గురురాజా ఒకరనీ అన్నారు. అయితే ఆయన కీలక భూమిక పోషించారన్నారు. ముఖ్యంగా తన సొంత ఉమ్మడి కర్నూలు జిల్లాకు ఆయన చేసిన సేవలు అమోఘమని కొనియాడారు. ప్రవాస ఆంధ్రులకు కూడా తెలుగుదేశం పార్టీలో సముచిత స్థానం కల్పించిన సీఎం చంద్రబాబు నాయుడు కు, రాష్ట్ర ఐటీ & విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :