ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / కర్నూల్ : ఏపీ ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఈఈ ఎం.లక్ష్మీనారాయణ, డిఈఈ లు జి.నాగరాజు, ఎం.బాల జోజప్ప ల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన అవగాహన సదస్సులో కర్నూలు పట్టణంలోని, సి.క్యాంపులో ఉన్న సిల్వర్ జూబ్లీ కళాశాలలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ కోర్సులకు దరఖాస్తులు చేసుకోవాలని ఏపీ ఈడబ్ల్యూఐడీసీ రాష్ట్ర డైరెక్టర్ జి.నాగముని, సిల్వర్ జూబ్లీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె.నాగరాజు శెట్టి, జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ పగిడి.ఓబులేసు లు తెలియజేశారు. ఈ సందర్భంగా ఏపీ ఈడబ్ల్యూఐడిసి రాష్ట్ర డైరెక్టర్ జి.నాగముని, ప్రిన్సిపాల్ డాక్టర్ కే.నాగరాజు శెట్టి, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ జిల్లా కో ఆర్డినేటర్ డాక్టర్ ఓబులేస్ లు మాట్లాడుతూ ఈ సంవత్సరము నుండి మన విద్యార్థులకు డిస్టెన్స్ లో డిగ్రీ పూర్తి చేసుకునే అవకాశం అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ప్రకటించిందని అన్నారు. ఈ డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీలో బిఏ, బి.కామ్, బిఎస్సి, బి.ఎల్.ఐ.సి, తదితర కోర్సులు ఉన్నాయని అన్నారు. కనుక ఏ జిల్లాలోని, వారైనా సరే ఈ కోర్సులకు దరఖాస్తు చేసుకోవచ్చని అన్నారు. ప్రతి ఒక్క విద్యార్ధి చదువుకోవాలనే తపన ఉన్నవారికీ మంచి సదావకాశం కల్పిచ్చిందని పేర్కొన్నారు. మరిన్ని వివరములు కొరకు ఆఫీస్ వెంకటకృష్ణ-9138629629 కు ఫోన్ చేసి సంప్రదించవచ్చు అన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఈడబ్ల్యూఐడీసీ డిపార్ట్మెంట్ సూపరిండెంట్ చింతకాయల వెంగన్న, జూనియర్ అసిస్టెంట్ నాయకంటి చిన్న మద్దిలేటి, సైట్ ఇంజనీర్లు కే.వెంకటరామిరెడ్డి, పి.సురేష్ కుమార్, సి.మహేష్, కె.సురేంద్ర కుమార్, పి.రఘు మధు మోహన్, ఎస్ఎండి.ఆజాజ్ బాషా ఉమామహేశ్వరరావు, ఆర్.దివ్య, కె.సిహెచ్.మునీశ్వర్, జి.ప్రవీణ్ కుమార్ రెడ్డి, ఎం.లక్ష్మన్న హరీష్, ఎన్.దినేష్, ఆఫీస్ సబార్డినేట్ లు పి.హీరాలాల్, సి.బాలయ్య, కే.సుబ్బడు, ప్రజలు పాల్గొన్నారు.
Admin
E Nivas News